Posts

Showing posts from February, 2022

మీ ఊరి పేరేమిటి? దానికి ఆ పేరెలా వచ్చింది?

మీ ఊరి పేరేమిటి? దానికి ఆ పేరెలా వచ్చింది? మా ఊరు రాజమండ్రి దగ్గర దివాన్చెరువు. నేను ఆరవ తరగతికి వచ్చేవరకు మా ఊరికి ఆ పేరెలా వచ్చిందో ఆలోచించలేదు, ఆలోచించాల్సిన సందర్భం కూడా రాలేదు. కానీ ఆరవ తరగతి మొదటిరోజు మా తెలుగు మాస్టారు బాబురావు గారు మమ్మల్ని ఒక్కొక్కర్ని నీ పేరేంటి, మీదేవూరు అని అడుగుతూ పరిచయం చేసుకుంటున్నారు. చాలా మంది దివ్యాన్చెరువు అని చెప్పడంతో అసలు మీ ఊరికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా అని అడిగారు. కాసేపు ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నాం గాని సమాధానం చెప్పలేకపోయాం. అప్పుడు అయన ఇలా సమాధానం చెప్పారు. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించేటప్పుడు, తన దగ్గర పనిచేసే దివాన్లకి (మంత్రుల పాలనా సహాయకులు) ఈ ప్రాంతం లో స్థలం కేటాయించడం, మొదట వారు వారి అవసరాలకి ఒక చెరువు ఏర్పాటు చేస్కోవడం వల్ల దానిని అందరు దివ్యాన్చెరువు అని పిలువడం మొదలు పెట్టారు. క్రమేణా ఈ ప్రాంతానికి కూడా అదే పేరు స్థిరపడింది. అన్నట్లు మా ఊరు సీతాఫలాలకి ప్రసిద్ధి. గమనిక: నా సమాధానంపై వచ్చిన ఈ అనుమానం సహేతుకంగా అనిపించింది. కానీ నాకు ప్రత్యుత్తరం ఇచ్చే సమాచారం లేక వారి వ్యాఖ్యను ఇ...

మీరు చూసిన అన్ని సినిమాలలో అత్యంత నిరుత్సాహపరిచిన చిత్రం ఏది?

మీరు చూసిన అన్ని సినిమాలలో అత్యంత నిరుత్సాహపరిచిన చిత్రం ఏది? ఈ సమాధానంతో చాలామంది ఏకీభవించపోవచ్చు. నేను అత్తారింటికి దారేది సినిమా చూసి చాలా నిరుత్సాహపడ్డాను. కథ, కథనాల విషయంలో సమస్య ఏం లేదు కానీ హాస్యం పేరుతో చేసిన ఒక వెకిలి చేష్ట నాకు నచ్చలేదు. సినిమాలో కొన్ని సందర్భాల్లో హీరో తన అసహనాన్ని తన కింద పనిచేసే వ్యక్తుల మీద చూపించి దాని నుండి హాస్యాన్ని పండించాలని చూసారు. డబ్బు మదంతో ఒక యువకుడు తన దగ్గర పనిచేసే ఒక పెద్దాయన మీద చేయి చేసుకుంటే సినిమా చూసే వాళ్ళకి ఎలా ఉందొ తెలీదు గాని నిజంగా ఆ పరిస్థితి లో ఉన్న కుటుంబానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కష్టం అనుభవమైతే తప్ప అర్ధం కాదు. నా బాల్యం లో జరిగిన ఒక దురదృష్ట ఘటన కళ్ళముందు కదిలినట్లు అనిపించింది నాకు. అదే సన్నివేశం మళ్లీ మళ్లీ చూపించి నవ్వుకోండ్రా అని చెప్పినట్లనిపించింది. అటువంటి సన్నివేశాలు ఆ ఒక్క సినిమా కి పరిమితమైతే సంతోషించే వాడిని. అని ఆ దర్శకుడు వాటిని తన మార్కు హాస్యంగా ప్రతీ చిత్రంలో పెట్టడం రుచించట్లేదు.