మీ ఊరి పేరేమిటి? దానికి ఆ పేరెలా వచ్చింది?

మీ ఊరి పేరేమిటి? దానికి ఆ పేరెలా వచ్చింది?

మా ఊరు రాజమండ్రి దగ్గర దివాన్చెరువు. నేను ఆరవ తరగతికి వచ్చేవరకు మా ఊరికి ఆ పేరెలా వచ్చిందో ఆలోచించలేదు, ఆలోచించాల్సిన సందర్భం కూడా రాలేదు.

కానీ ఆరవ తరగతి మొదటిరోజు మా తెలుగు మాస్టారు బాబురావు గారు మమ్మల్ని ఒక్కొక్కర్ని నీ పేరేంటి, మీదేవూరు అని అడుగుతూ పరిచయం చేసుకుంటున్నారు. చాలా మంది దివ్యాన్చెరువు అని చెప్పడంతో అసలు మీ ఊరికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా అని అడిగారు. కాసేపు ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నాం గాని సమాధానం చెప్పలేకపోయాం. అప్పుడు అయన ఇలా సమాధానం చెప్పారు.

రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించేటప్పుడు, తన దగ్గర పనిచేసే దివాన్లకి (మంత్రుల పాలనా సహాయకులు) ఈ ప్రాంతం లో స్థలం కేటాయించడం, మొదట వారు వారి అవసరాలకి ఒక చెరువు ఏర్పాటు చేస్కోవడం వల్ల దానిని అందరు దివ్యాన్చెరువు అని పిలువడం మొదలు పెట్టారు. క్రమేణా ఈ ప్రాంతానికి కూడా అదే పేరు స్థిరపడింది. అన్నట్లు మా ఊరు సీతాఫలాలకి ప్రసిద్ధి.


గమనిక: నా సమాధానంపై వచ్చిన ఈ అనుమానం సహేతుకంగా అనిపించింది. కానీ నాకు ప్రత్యుత్తరం ఇచ్చే సమాచారం లేక వారి వ్యాఖ్యను ఇక్కడ పంచుకుంటున్నాను.

దివాన్ - పారసీ పదమో, ఉర్దూ పదమోనండీ.

రాజ రాజ నరేంద్రుడు 10వ శతమానానికి చెందిన రాజు, అప్పటికింకా ఆ భాషల ప్రభావం తెలుగు మీద లేదు.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?