మీరు చూసిన అన్ని సినిమాలలో అత్యంత నిరుత్సాహపరిచిన చిత్రం ఏది?
మీరు చూసిన అన్ని సినిమాలలో అత్యంత నిరుత్సాహపరిచిన చిత్రం ఏది?
ఈ సమాధానంతో చాలామంది ఏకీభవించపోవచ్చు. నేను అత్తారింటికి దారేది సినిమా చూసి చాలా నిరుత్సాహపడ్డాను.
కథ, కథనాల విషయంలో సమస్య ఏం లేదు కానీ హాస్యం పేరుతో చేసిన ఒక వెకిలి చేష్ట నాకు నచ్చలేదు. సినిమాలో కొన్ని సందర్భాల్లో హీరో తన అసహనాన్ని తన కింద పనిచేసే వ్యక్తుల మీద చూపించి దాని నుండి హాస్యాన్ని పండించాలని చూసారు. డబ్బు మదంతో ఒక యువకుడు తన దగ్గర పనిచేసే ఒక పెద్దాయన మీద చేయి చేసుకుంటే సినిమా చూసే వాళ్ళకి ఎలా ఉందొ తెలీదు గాని నిజంగా ఆ పరిస్థితి లో ఉన్న కుటుంబానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కష్టం అనుభవమైతే తప్ప అర్ధం కాదు. నా బాల్యం లో జరిగిన ఒక దురదృష్ట ఘటన కళ్ళముందు కదిలినట్లు అనిపించింది నాకు. అదే సన్నివేశం మళ్లీ మళ్లీ చూపించి నవ్వుకోండ్రా అని చెప్పినట్లనిపించింది.
అటువంటి సన్నివేశాలు ఆ ఒక్క సినిమా కి పరిమితమైతే సంతోషించే వాడిని. అని ఆ దర్శకుడు వాటిని తన మార్కు హాస్యంగా ప్రతీ చిత్రంలో పెట్టడం రుచించట్లేదు.
Comments
Post a Comment