Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?
ఒక ప్రణాళిక ప్రకారం కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా కొన్ని సంస్థలకోసం కోరాలో ప్రచారం చేస్తున్నారేమోనని అనిపిస్తుంది. పైగా అది ప్రచారం అనే విషయం తెలియనంత తెలివిగా ఆ పని చేస్తున్నారని నా అనుమానం.
ఉదాహరణకి ఈ క్రింది సమాధానాన్ని పరిశీలిస్తే ఆ సమాధానం ఒక కోర్స్ యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ వ్రాయబడింది. ఆ సమాధానం వ్యక్తిగత విషయం అని అనుకోవచ్చు.
కానీ ఈ సమాధానాన్ని అప్వోట్ చేసిన వారిని చూస్తే ఒక విషయం అర్ధం అవుతుంది. ఆ తొమ్మిదిమంది కోరా అన్ని భాషల్లోనూ రాసిన సమాధానాలన్నింటిలో 95 శాతం పైగా కేవలం ఒకే ఒక్క అంశంమీద వ్రాయబడ్డాయి. అది కూడా పదులనుండి వందలసంఖ్యలో. వేరే సామజిక మాధ్యమాలలోని వారి ఖాతాలలో కూడా ఇదే ప్రవర్తన. వాటిలో కేవలం ఒక సంస్థకి సంబందించిన ప్రచారం మాత్రమే జరుగుతుంది.
ఈ ఖాతాలలో కొన్నింటికి డాక్టర్, బిట్స్ పిలానీ వంటి అర్హతలు కనిపిస్తున్నాయి కానీ ఆ అంశాలలో వాళ్ళ సమాధానాలు శూన్యం, లేదా దాదాపుగా శూన్యం.
ఒకవేళ ఇవి నిజమైన ఖాతాలే అయితే వారికి వేరే జీవితమే లేనట్లు, ఆ సంస్థకి దాసోహం అయిపోయినట్లు రోజంతా ఆ సంస్థ ప్రచార కార్యక్రమాల్లోనే ఎందుకు మునిగితేలుతున్నారు? వీరు ఆధ్యాత్మికత పేరుతో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే వారి కుటుంబ సభ్యుల బాధ మాటల్లో చెప్పలేనిది. ఇవి నకిలీ ఖాతాలైతే వాటిని నడుపుతున్న సాంకేతిక సంస్థ ఎవరు? అది ఎవరి ప్రతినిధి? ఆ వందలకొద్దీ ఒకేరకమైన సమాధానాలతో, వేలకొద్దీ ట్వీట్లు, పోస్టులు, వీడియోలతో వారు ఏం చేద్దామనుకుంటున్నారు?
కార్పొరేట్ సంస్థలు, రాజకీయపార్టీలను మించి కోరాతో సహా అన్ని సామజిక మాధ్యమాలలో వీరు చేస్తున్న వేలంవెర్రి ప్రచారం నాకు అతిగా అనిపిస్తుంది.
Comments
Post a Comment