ఇంటి నిర్మాణం గురించి ఏమి తెలుసుకోవాలి?
మా తమ్ముడు ఈ మధ్య విద్యుత్తు మరియు ప్లంబింగ్ పరికరాలు టోకు వ్యాపారం మొదలు పెట్టాడు. వాడి అనుభవంతో నాకిచ్చిన ఒకే ఒక సలహా ఇది.
నిర్మాణ సామాగ్రి కొనుగోలుని టెక్నీషియన్ కి అప్పజెప్పడం వలన ఆ వ్యాపారస్తుడు టెక్నీషియన్ కి అయిదు నుండి పది శాతం కమిషన్ (నా దృష్టిలో లంచం) ఇవ్వవలసి వస్తుంది. అసలే మార్కెట్లో పోటీ తట్టుకోవడానికి దొరికిన ధరకే అమ్మాల్సిన పరిస్థితులలో అంత కమిషన్ ఇవ్వడం కుదరదు. ఆ మొత్తాన్ని మీ దగ్గర నుండే అదనంగా వసూలు చెయ్యాల్సి వస్తుంది. అందుకే మీకు బాగా తెలిసిన టెక్నీషియన్ కాకపోతే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
Comments
Post a Comment