నేటి సమాజంలో మీరు మార్చాలనుకుంటున్న ఒక అంశం ఏమిటి?

 నా సమాధానం కొంతమందిని నొప్పించవచ్చు. కాని చెప్పాలనే నిర్ణయించుకున్నా.

మన నమ్మకాలని, బలహీనతల్ని ఉపయోగించుకుని వాళ్ళ పబ్బం గడుపుకుంటున్న దొంగ సన్నాసులనుండి కనీసం నాకు తెలిసిన వాళ్ళనైనా కాపాడుదాం అనుకున్నా. కానీ విఫలమౌతూనే ఉన్నాను.

ఆ మోసగాళ్ళలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు జగ్గీ వాసుదేవ్. ఈయనగారు ప్రాచీన విజ్ఞానం పేరుతో ప్రచారం చేస్తున్న నకిలీ శాస్త్రాన్ని చూస్తుంటే ఇది ఇంతకీ దారి తీస్తుందో అని భయం వేస్తుంది.

పాదరసం ప్రాణాంతకం కాదు, మన ఋషులు దాన్ని తాగేవారు, నేను వట్టి చేతులతో శుద్ధ పాదరసాన్ని గడ్డ కట్టిస్తాను, సైన్సుకి కూడా అర్ధం కానీ విషయం ఇది అని నమ్మబలికాడు. ఇది నమ్మి అంధ భక్తులు వాళ్ళ పిల్లలకి ఎక్కడ పాదరసం తినిపిస్తారేమో అని గుబులు కలుగుతుంది.

మన సాధువులు చనిపోయిన వారిని తిరిగి బతికించగలరు, చనిపోయిన వ్యక్తి 14 రోజుల వరకు ప్రాణం దేహాన్ని వదిలిపెట్టదు అని సొల్లు కబుర్లు చెప్పాడు. మదనపల్లెలో జరిగిన సంఘటనకి ఈయన అసత్య ప్రచారాలకి దగ్గర పోలిక ఉంది. తాను ఇప్పటి వరకు నాలుగు జన్మలెత్తానని తన భార్య పూర్వ జన్మలో తన చెల్లెలని, ఇప్పటి తన భక్తురాలైన భారతి తన పూర్వ జన్మ ప్రియురాలని రాసేసాడు.

బాధపడాల్సిన విషయం ఏంటంటే హేతుబద్దంగా ఆలోచించాల్సిన వాళ్ళు కూడా మతం ముసుగులో ఇటువంటి మూఢ విశ్వాసాల్ని ప్రచారం చేస్తున్న వారికీ భజన చేస్తూ బతుకుతున్నారు. ఇదే బాటలో నిత్యానంద, ఆసారాం, ప్రదీప్ జోషి, వేణు స్వామి, జాకిర్ నాయక్, పాల్ లాంటి వాళ్లు కోట్లు కూడబెడుతున్నారు.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?