ఠాగూర్ లో చిరంజీవి గారిలా, తెలుగు భాషలో మీకు నచ్చని పదం?
- "అయినా/అయినప్పటికీ"
ఈ పదం ఉపయోగించారంటే నూటికి తొంభైసార్లు లోపం ఎత్తిచూపించి దానికి ఓదార్పు మాట జత చేస్తారన్నమాట.
నువ్వు రంగు తక్కువైనప్పటికీ మొహం కళగా ఉంటుంది.
ఆడపిల్లైనప్పటికీ సిటీలో ఒక్కత్తే ఉంటూ జాబు చేసేసుకుంటుంది.
వాళ్ళావిడ లేకపోయినా పిల్లల్ని బానే పెంచేసాడు.
అలవాటులో అనుకోకుండా ఇలా అనేవారు కొంతమందైతే, కావాలనే దెప్పిపొడవడానికి అనేవారు మరికొంతమంది. నేను అప్పుడప్పుడూ అనాలోచితంగా అనేస్తుంటాను. కానీ తర్వాత గుర్తొచ్చిన తర్వాత బాధపడుతుంటాను.
- "నీసు"
అసలు తినే తిండికి నీసు/నీచు పదప్రయోగం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఒకప్పుడు ఈ పదం అర్ధం తెలియనప్పుడు నేను కూడా మాంసాహారాన్ని "నీసు" అనే అనేవాడిని. కానీ ఆ తర్వాత అర్ధం తెలిసాక వాడడం మానేసాను.
Comments
Post a Comment