సద్గురు పట్ల మీ అభిప్రాయం ఏమిటి?
గౌతమ్ గారు రాసిన సమాధానంతో నేను ఏకీభవిస్తాను.
జగ్గీ వాసుదేవ్ ఒక యోగ గురువు. ఆయన యోగాసనాల గురించి హిందూ జీవన విధానాల గురించి మాట్లాడితే అభ్యంతరం చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన ప్రచారం చేసే నకిలీ శాస్త్రం ప్రజలకి హాని చేసే అవకాశం కూడా ఉంది.గౌతమ్ గారు ఎత్తిచూపిన తప్పులే కాక అయన పాదరసం గురించి, ఆత్మల గురించి, వైద్య విధానాల గురించి చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
తాను చేసిన ఆవిష్కరణలకు గణిత రుజువులు సమర్పిస్తే తనకి నోబెల్ బహుమతి ఇస్తారని నోబెల్ బహుమతి వచ్చిన ఒక శాస్త్రవేత్త తనకి చెప్పారని, కానీ ఆ బహుమతి తనకి అవసరం లేదు కాబట్టే అసలు ఆ ప్రయత్నం కూడా చెయ్యదలచుకోలేదని అన్నాడు. పైగా తాను చేసిన ఆవిష్కరణలేంటో, నోబెల్ బహుమతి వచ్చిన ఆ శాస్త్రవేత్త ఎవరో చెప్పలేదు. పైగా ఈ మాటలు నోబెల్ బహుమతి తీసుకున్న వారి కృషిని అవమానించినట్లుఉంది.
ఆయన చెప్పిన మాటలని ఎవరైనా ప్రశ్నించినా, వ్యతిరేకించినా ప్రశ్నించిన వారిని హేళన చేసి మాట్లాడుతారు. ఆయన భక్తులైతే ఇంటర్నెట్లో ప్రత్యక్ష యుద్ధమే చేస్తారు. చివరికి రుజువులు చూపించలేక ఇది హిందూ మతం మీద దాడి అంటారు. లేకపోతే పాశ్చాత్య బానిస అంటారు. నిజానికి మన దేశంనుండి సంఖ్యా, ఖగోళం, ఆర్ధికం లాంటి శాస్త్రాలలో ప్రపంచాన్ని తలదన్నే ఆవిష్కరణలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే జరిగాయి. కానీ ఇప్పటికి ఈ గురువులు భూత, ప్రేత పూజలు, జాతక చక్రాల దగ్గరే ఆగిపోయి మనల్ని కూడా అక్కడికే తీసుకువెళ్తున్నారు.
Comments
Post a Comment