ఇది మోసం , అని తెలిసి కూడా ఎపుడైనా మోసపోయారా ?

 అంగన్వాడీ టీచర్ గారు బలవంతపెడితే తమ్ముడి జీతంలో నెలనెలా పొదుపు చెయ్యడానికి గవర్నమెంట్ పథకం ఒకటి తీసుకున్నానని మా అమ్మ ఫోన్లో చెప్పారు. పేరు, వివరాలు అడిగితే అవేమి నాకు చెప్పడం రాదు, నువ్వింటికొచ్చినప్పుడు చదువుకో అని చెప్పారు.

కొన్ని నెలల తర్వాత ఇంటికివెళ్ళినపుడు డబ్బులు కట్టిన రసీదులు చూస్తే అగ్రిగోల్డ్ అని ఉంది. ఇది గవర్నమెంట్ కాదు, అంగన్వాడీ టీచర్ గారు అబద్దం చెప్పారు అని అర్ధం అయింది. మానేయమని చెప్తే కట్టిన డబ్బులు రావు, ఇంకెంత మూడేళ్లే కదా అని ప్రతినెలా ఆరు వందలు కట్టారు. దాదాపు మొత్తం కట్టేసిన తర్వాత చివర్లో కంపెనీ జెండా పీకేసాడు. ఇక ఆ డబ్బుల సంగతి మర్చిపోతే మనఃశాంతిగా ఉంటుందని చెప్పాను.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?