మీ పిల్లలకు పేర్లు ఎలా వెతికారు? ఆ ప్రక్రియలో మీకు ఎదురైన అనుభవాలెటువంటివి?

 5వ నెల స్కానింగుకి వెళ్ళినప్పుడు అమ్మాయో అబ్బాయో తెలుస్తుంది, ఆ తర్వాత ఆలోచించొచ్చు అనుకున్నాము. కానీ స్కానింగ్ పూర్తయిన తర్వాత బిడ్డ కాళ్ళు ముడుచుకుని ఉంది, ఎంత ప్రయత్నించినా తెలియట్లేదు అని చెప్పారు.

అమ్మాయి కోసం మూడు పేర్లు, అబ్బాయి కోసం ఒక పేరు(మా నాన్నగారి పేరు కృష్ణ) ఆలోచించాము. ఆఫీసులో నా స్నేహితులతో మాట్లాడేటప్పుడు నా సహోద్యోగి అడిగితే రియా లేదా కృష్ణ అని అనుకుంటున్నాం అని చెప్పాను. రియా అనే పదానికి స్వీడిష్ భాషలో "సేల్" అని అర్ధం అని గుర్తు చేసాడు. విషయం నా భార్యకి చెబితే చాలా సంతోషంగా తనకి బాగా ఇష్టమైన లిస్టులో రెండవ స్థానంలో ఉన్న పేరుని మొదటికి తెచ్చింది.

నన్ను ఎంతో ప్రభావితం చేసిన ఒక జీవ శాస్త్రవేత్త పేరు మధ్య పేరుగా పెట్టడానికి నా భార్య అనుమతినిచ్చింది. అనాదిగా వస్తున్న తోకపేరుని నా బిడ్డ విషయంలో దరిచేరనివ్వలేదు.

ఆ విధంగా మా అమ్మాయికి సహన షార్లెట్ అని పేరు పెట్టాము.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?