మహిళలు సమానం కాదు, ప్రత్యేకం. వారి స్థాయి సమానత్వం కన్నా ఎక్కువ అని ఒక వాదన వినిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

 ఈ వాదన వల్ల మహిళలకు మేలు జరగకపోగా ప్రస్తుతం సమాజంలో మహిళలకు సమాన స్థాయి కోసం పోరాడేవారి ఆశయాలకు కీడు జరిగే అవకాశమే ఎక్కువ ఉంది.

ఈ వాదన పురుషుల నుండి వస్తున్నట్లయితే వారు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యతను పూర్తిగా ఆడవారిమీద మోపబోతున్నారని అర్ధం. ఆడవారు పువ్వులవంటివారు, అపురూపమైన వజ్రాలవంటివారు అని పోల్చి, వాళ్ళు వేసుకోవాల్సిన దుస్తులు ఆభరణాల నుండి ఇంట్లోనూ, ఇంటిబయటా వారి నడవడిక వరకూ అన్నింటి మీదా పురుషులకు వర్తించని ఆంక్షలు పెట్టబోయే వారే ఇటువంటి మాటలు మాట్లాడుతారు.

ఇదే వాదన మహిళల నుండి వస్తే వారికి సమాజంలో ఆడవారు ఎదుర్కొనే వివక్ష గురించి అవగాహన లేదని నా అభిప్రాయం. ఆ అవగాహనే ఉంటే వారు సమానత్వం కావాలని కోరుకుంటారు తప్ప తామొక ప్రత్యేకమైనవారమని భావించరు. ఒకవేళ ఈ ఆడవారు కూడా ముందు మాట్లాడుకున్న కొంతమంది మగవారి అభిప్రాయంలాగా సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత కేవలం ఆడవారిమీదే ఉంటుంది కాబట్టి వారు ప్రత్యేకమని భావిస్తుంటే వారికి స్టాక్ హోమ్ సిండ్రోమ్ ఉందని అనుకోవచ్చు.

ఇక సంతానోత్పత్తిలో ఆడవారు కష్టమైన బాధ్యత తీసుకుంటారు కాబట్టి వారు ప్రత్యేకం అనే వాదనను ఖండించలేను, ఏకీభవించలేను. లైంగికపరమైన ఈ తేడాలను చూపించి ఆడవారు సమానత్వం కన్నా ఎక్కువ అనడమనేది కండబలం ఎక్కువ ఉండే మగవారు ఆడవారి కంటే గొప్పోళ్ళు అనుకోవడంతో సమానమని నా ఎంచిక.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?