మీరు కోలుకోలేని కష్టంలో ఉన్నపుడు మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మీకు సహాయం చేశారా?
చాలా మంది ఉన్నారు.
నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చినప్పుడు మా రెండో పెద్దమ్మ, పెద్ద పెద్దమ్మగారి అబ్బాయి, నా మేనబావ కలిసి నాకు కంప్యూటర్ కొనడానికి సాయం చేసారు. అప్పటి పరిస్థితిలో నా కాలేజీ ఫీజు కట్టడమే మా నాన్నగారికి తలకు మించిన భారంలా ఉండేది. వారు చేసిన సహాయం నా చదువుకు చాలా ఉపయోగపడింది.
నా బాల్య స్నేహితుడు లోవరాజుకి నాకు చిన్న విషయంలో మనస్పర్థలు వచ్చి రెండేళ్లు పైగా మాట్లాడుకోలేదు. కానీ మా నాన్నగారు చనిపోయినప్పుడు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చి ఇంట్లో ఉన్న ముగ్గురు భోజనం కూడా చెయ్యలేదని చూసి ఇంటికెళ్లి క్యారేజీ పట్టుకొచ్చాడు. కష్టం వస్తే నా వెనక నిలబడే వాళ్ళు ఉన్నారు అనే భరోసా ఇచ్చాడు వాడు.
Comments
Post a Comment