తాబేలు మాంసం తినవచ్చా?
వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కొన్ని రకాల తాబేళ్ల మాంసాన్ని తినడం మాత్రమే కాదు, వాటిని వేటాడినా, అవి గుడ్లు పెట్టడానికి కేటాయించిన అభయారణ్యాలను నాశనం చేసినా కూడా నేరమే. [1]
అయితే కోస్తా ప్రాంతాలలోని కొన్ని వర్గాలలో తాబేటి మాంసం ఆహారంగా తీసుకోవడం సాధారణమైన విషయం. ముఖ్యంగా మంచినీటిలో ఉండే డిప్ప తాబేళ్లు, మెట్ట తాబేళ్లను వీరు ఆహారంగా తీసుకుంటారు.
ఒకప్పుడు పిల్లలు పుట్టని ఆడవారికి సంతానం కలగడానికి తాబేలు చేదుకట్టును పచ్చిగా బలవంతంగా తినిపించేవారు. ఈ మూఢ నమ్మకానికి ప్రత్యక్ష ఉదాహరణ మా అమ్మగారే. ఈ నాటు వైద్యాలన్నీ వికటించి చివరికి ఆరోగ్యం చెడిన తర్వాత డాక్టర్లను సంప్రదించి సరైన వైద్యం తీసుకుని కోలుకున్నారు.
అవకాశం దొరికింది కాబట్టి నా సూక్తిముక్తావళి:
ఇటువంటి మూఢనమ్మకాలకు మన సమాజంలో ఎప్పటికీ స్థానం ఉంటుంది. పిల్లలు పుట్టడంలేదని బొడ్డుతాడుని తినిపించి ఒకమ్మాయి చావుకు దారితీసిన అమానవీయ ఘటన జరిగింది 2021లోనే.
Comments
Post a Comment