ఇతర దేశాల్లోనూ, మన దేశంలోనూ సినిమా చూసే అనుభవంలో ఏమైనా తేడాలు ఉంటాయా? ఉంటే అవి ఏమిటి?
స్వీడన్లో సినిమా హాళ్లు మన దేశంలోని మల్టీప్లెక్స్ లాగానే ఉంటాయి. మనదేశంతో పోలిస్తే నేను రెండు తేడాలు గమనించాను.
ఒకటి హాలు సామర్థ్యం. ఇక్కడ హాళ్లు కొంచెం చిన్నగా ఉంటాయి. నేను వెళ్లిన పెద్ద హాల్లో 250 కుర్చీలున్నాయి. దానిని ఆ నగరంలో ఉన్న అతిపెద్ద సినిమాహాలు అని చెప్పారు. మన సాధారణ థియేటర్లు కూడా అంతకంటే పెద్దగా ఉంటాయి. ఇక నేను చూసిన అతి చిన్న హాలులో 32 కుర్చీలు మాత్రమే ఉన్నాయి. అక్కడ మమ్మీ సినిమాకి వెళ్ళినప్పుడు కేవలం ముగ్గురు ప్రేక్షకులం మాత్రమే ఉన్నాము.
రెండు చిరుతిండి. ఇక్కడ మన చిరుతిండి బయటనుండి తెచుకోవచ్చు. హాల్లోకి వెళ్ళడానికి ముందే స్వీడన్ వాళ్ళు ఈకా(ica)కి వెళ్లి ఒక కాగితపు సంచిలో తలో అరకేజీ జీళ్ళు (godis) తెచ్చుకుంటారు. పంచదార జీళ్ళు అమ్మే ప్రదేశం ఇలా ఉంటుంది.
హాల్లో కూడా అమ్ముతారుగాని ధర ఎక్కువ ఉంటుంది. వేడి వేడి పేలాలు, చల్లని ఐస్ క్రీమ్స్ మాత్రం బాగా అమ్ముడవుతాయి. మేము మాత్రం ఒక చిన్న డబ్బాలో జంతికలు, కరప్పూస వేసుకెళ్తాము :)
ఇక మన తెలుగు సినిమాలకొస్తే మేముండే చిన్న పట్టణంలో సంవత్సరానికి ఒక సినిమా వస్తే గొప్పే. అందుకే చాలా తక్కువ సినిమాలు చూసాము. చూసిన కొద్ది వాటిలోనూ అజ్ఞాతవాసి, స్పైడర్, కాటమరాయుడు, సరిలేరు నీకెవ్వరూ లాంటి ఆణిముత్యాలు తగిలాయి.
Comments
Post a Comment