డే లైట్ సేవింగ్ టైం విషయంలో మీ అనుభవాలు ఏమిటి? విదేశాల్లో జీవించడం మొదలుపెట్టాకా దీని విషయమై కానీ, అర్థం చేసుకోవడంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?

 ఇండియాలో ఉన్నప్పుడే మా క్లయింట్ దేశంలో సంవత్సరానికి రెండు సార్లు టైం మార్పు ఉంటుందని తెలుసుగాని అది ఎప్పుడు, ఎందుకు చేస్తారో మాత్రం ఐరోపాకి వచ్చిన తర్వాతే తెలిసింది.

ఇక్కడికి వచ్చిన రెండు నెలలకి గడియారంలో సమయం నా ఫోన్లో కంటే ఒక గంట ఎక్కువ చూపిస్తుంటే తప్పు చూపిస్తుందేమో అనుకుని మార్చుకున్నాను. తర్వాతి రోజు ఆఫీసుకి వెళ్ళాక వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్న గోడ గడియారం, చేతి గడియారంలోను టైం మార్చుకున్నావా అని. అప్పుడర్ధమయ్యింది గడియారం బానే పనిచేస్తుంది కానీ టైం మారిందని, ఫోన్లో ఇంటర్నెట్ వల్ల మార్పు దానికదే జరిగిందని. తర్వాత సమయం మార్పు జరిగే రెండు నెలల్లో (మార్చి , అక్టోబర్) గోడ గడియారం మార్చుకోవడం అలవాటైపోయింది.

డే లైట్ సేవింగ్ టైం వల్ల నా పనిలో ఒక తప్పు జరిగింది. నేను టెలికాం కంపెనీ లో పనిచేస్తున్న కొత్తలో మేము పని చేస్తున్న ప్రాజెక్ట్ టెస్టింగ్లో నేను రాసిన ఒక టెస్ట్ కేస్ ఉన్నట్టుండి స్వీడన్లో అందరికీ విఫలమవుతుంది కానీ ఇండియాలో పనిచేసేవారికి సఫలమవుతుంది. ఒక రోజంతా ఆ విచిత్ర సమస్యతో కుస్తీ పడ్డ తర్వాత విషయం తెలిసి నాలుక కరుచుకున్నా. ఇండియా టైం ఉన్న కంప్యూటర్లో ప్రస్తుత తేదికి నెల రోజులు కలిపితే 720 గంటలు వస్తుంది కానీ స్వీడన్ టైం ఉన్న కంప్యూటర్లో 719 గంటలే వస్తుంది. విషయం ఏంటంటే నేను ఆ టెస్ట్ కేస్ రాసింది డిసెంబర్లో. అప్పుడు డే లైట్ సేవింగ్ టైం గురించి ఆలోచించలేదు. కానీ ఫిబ్రవరి చివరిలో తేదికి ఒక నెల కలిపినప్పుడు మధ్యలో డే లైట్ సేవింగ్ టైం వల్ల ఒక గంట సమయం తగ్గింది. దానితో ప్రపంచం మొత్తంలో డే లైట్ సేవింగ్ టైం సేవింగ్స్ ఉన్న దేశాల టైంతో నా టెస్ట్ కేసుని ప్రయత్నించాల్సొచ్చింది. జీవితంలో మళ్ళీ డే లైట్ సేవింగ్ సమయాన్ని మర్చిపోతే ఒట్టు.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?