మీరు చదువుకునేటప్పుడు మీకు బాగా కష్టంగా అనిపించిన సబ్జెక్ట్ ఏది? ఎందుకు?

 బళ్ళో చదివేటప్పుడు నాకు కష్టంగా అనిపించే సబ్జెక్ట్ ఆంగ్లము. ముఖ్యంగా పదవ తరగతిలో మా శ్రీనివాసరావు మాస్టారు నా ఇంగ్లీష్ ఉచ్చారణ విని ఇంకా మెరుగు పడాలని చెబుతుండేవారు. చివరికి నాకు ప్రత్యేకంగా సిలబెల్స్ నేర్పించే ప్రయత్నం చేసారు కానీ నా బుర్రకెక్కలేదు. కానీ పబ్లిక్ పరీక్షల్లో ఇంగ్లీషులో చెప్పుకోదగ్గ మార్కులే వచ్చాయి.

కళాశాలలో చదివినప్పుడు కూడా ఇంగ్లీష్ కొంచెం ఇబ్బంది పెట్టింది. కానీ భయపెట్టింది మాత్రం నెట్వర్క్ ప్రోగ్రామింగ్. అసలా సబ్జెక్టు ఒక్క క్లాస్ కూడా అర్ధం కాలేదు. పరీక్షలకి ఒక రోజు ముందు ఒక రెండు చాఫ్టర్లు చదివి పరీక్ష గట్టెక్కించేసాను.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?