ఏదైనా సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏది?

 మన సినిమాల్లో హాస్యం ఎక్కువగా ఎదుటి మనిషి ఇబ్బందులలోనుండి పుడుతుంది. కానీ మన సొంత పాట్లలో కూడా నవ్వులు వెతుక్కోవచ్చనే సన్నివేశాలు తక్కువగా ఉంటాయి. చంద్రశేఖర్ యేలేటి గారి ఐతే సినిమాలోని అటువంటి ఒక సన్నివేశం చూసినప్పుడల్లా గతంలో నేను పడ్డ అటువంటి తిప్పలు గుర్తొచ్చి నవ్వొస్తుంది.

నిరుద్యోగ బృందంలోని రాముకి ఒకసారి డబ్బు అవసరమొచ్చి స్నేహితురాలైన అదితిని అడుగుతాడు. తన దగ్గర డబ్బులేక ఆమె మరో స్నేహితుడైన కుమార్ని సర్దమని అడుగుతుంది. కుమార్ వట్టి చేతులతో వచ్చి ఆ పని వివేక్ కి అప్పగించానని అంటాడు. కాసేపటికి వివేక్ వచ్చి పని అయిపోయిందని చెప్పి జేబులో చెయ్యి పెట్టి డబ్బులు తీసినట్లుగా జేబు రుమాలు తీసి మొహం తుడుచుకుని డబ్బులు వెనుక వస్తున్నాయని చెప్తాడు. కాసేపటికి శంకర్ వచ్చి వివేక్ దగ్గర డబ్బు లేక తనని తీసుకురమ్మని చెప్తే రామూ, శంకర్ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. విషయం అర్థంకాక మిగిలిన వాళ్ళందరూ వెర్రిమొహం వేస్తారు. ఎందుకు నవ్వుతున్నారో చెబితే మేము కూడా నవ్వుతామ్ కదా అని అదితి అడిగితే, అసలు డబ్బడిగిందే శంకర్ ఇంటికి పంపడానికని నవ్వుతూనే చెప్తాడు. దానితో మిగిలిన వారందరూ వాళ్లిద్దరికీ తోడవుతారు.

ముఖ్య పాత్రల గడ్డు పరిస్థితులను ఏడుపు పెడబొబ్బలు లేకుండా దర్శకుడు చాలా చక్కగా వివరించారు.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?