మీకు అవకాశం వస్తే, ఏ దేశంలో పర్యటించాలని ఉంది? ఎందుకు?
గత 6 సంవత్సరాలుగా నేను వెళ్లాలనుకుంటూ వెళ్లలేకపోతున్న ప్రదేశం నార్వేలోని ట్రోల్ తుంగ (రాక్షస నాలుక).
ఆరేళ్లక్రితం నార్వే దేశస్తుడైన నా సహోద్యోగి స్టెయినర్ ట్రోల్ తుంగలో తన వేసవి విహారాన్ని వివరిస్తూ కొన్ని చిత్రాలు చూపించాడు. ట్రోల్ తుంగ వెళ్లడానికి సులువైన ప్రయాణ మార్గం, ప్రయాణానికి కావలసిన సరంజామా కూడా వివరించాడు. ఆ ప్రకృతి, పరిసరాలు చూసాక ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని అనిపించింది. ఒకవేళ నేను నా ఉద్యోగరీత్యా నార్వే వస్తే నన్ను అక్కడికి తీసుకుని వెళ్తానని కూడా చెప్పాడు. కానీ నాకు ఆ అవకాశం రాలేదు.
ఆ తరువాత ఆ ప్రక్క దేశంలో స్థిరపడినప్పటికీ మొదటి సంవత్సరం పని వత్తిడి, తరువాత రెండేళ్లు వీసా పరిమితులతో విరమించుకోవలసివచ్చింది. అక్కడికి చేరుకోవడానికి చివరి మెట్టులో ఏటవాలు కొండలపై పది గంటలు నడవాలి. మునుపెన్నడూ అటువంటి కష్టతరమైన ప్రయాణం చేసిన అనుభవం లేకపోవడంచేత ముందుగా మా శరీర దృఢత్వం పెంచుకోవడానికి 5 కిలోమీటర్ల పరుగు కూడా అలవాటు చేసుకున్నా. కానీ మా అమ్మాయి పుట్టిన తర్వాత తనకి పది పన్నిండేళ్లు వచ్చేవరకు తనని తీసుకువెళ్లడం సాధ్యపడదని నేను, మా ఆవిడా ఇక ఆ ప్రయాణం గురించి ఇప్పుడప్పుడే ఆలోచిండకూడదని నిర్ణయించుకున్నాం. బహుశా ఒక పన్నిందేళ్ళ తర్వాత మా కూతురితో కలిసి వెళ్తామేమో!
Comments
Post a Comment