డైనోసార్లు ఉండేవన్నది కాదనలేని సత్యం కదా, మరి హైందవ పురాణాలలో వీటి ప్రస్తావన ఎక్కడైనా ఉందా?
డైనోసార్లు భూమి మీద జీవించిన కాలాన్ని సైన్స్ పరిభాషలో జురాసిక్ కాలం అంటారు. ఇది సుమారు 20 కోట్ల సంవత్సరాల క్రితంనుండి 15 కోట్ల సంవత్సరాల క్రితం వరకు, అంటే దాదాపు 5 కోట్ల సంవత్సరాల కాలం జరిగింది. ఇంత సుదీర్ఘ కాలంలో ఎన్నో రాక్షసబల్లి జాతులు పరిణామం చెంది, అంతరించాయి. 5 కోట్ల సంవత్సరాలక్రితం జరిగిన ఉల్కాపాతం కారణంగా పెద్దజాతులు అంతరించాయి, అప్పుడు మిగిలినవి ఇప్పటి పక్షి జాతులకు పూర్వికులు అని శిలాజ అవశేషాలని అధ్యయనం చేసే శాస్త్రవేత్తల అంచనా.
ఇక మానవుని పరిణామక్రమంలో నేటి చింపాంజీలకి, మనకి పూర్వికులైన హోంమినిని వర్గపు చీలిక 80 లక్షల సంవత్సరాలక్రితం జరిగింది. అక్కడినుండి తెలివైన హోమోసెపియాన్స్ ఆవిర్భవించింది సుమారు ఒక లక్ష నుండి 80 వేల సంవత్సరాలక్రితం మాత్రమే. అంటే రాక్షసబల్లి, మనిషీ ఒకేసారి భూమిమీద జీవించడం అనేది అబద్దం అని తెలుస్తుంది.
వివిధ మతాల పురాణాల్లో, ఆలయాల మీద ఉన్న రాక్షసబల్లులు అని చెప్పబడుతున్న ఆకారాలకి కారణాలు విశ్లేషించుకుంటే 3 సిద్ధాంతాలు ప్రతిపాదించొచ్చు.
ఒకటి, మన పూర్వీకులకు డైనోసార్ల అవశేషాలు దొరికి ఉండాలి. కానీ టా ప్రోహ్మ్ మీద ఉన్నాయి అని చెప్పబడుతున్న స్టెగోసర్స్ అవశేషాలు దక్షిణ అమెరికా, పోర్చుగల్ ప్రాంతాలలో మాత్రమే అదికూడా కేవలం రెండు వందలేళ్ళ క్రితం దొరికాయి. రెండు, ఆ ఆకారం భారతదేశము, కంబోడియాలలో సామాన్య వన్యప్రాణులైన పంగోలిన్, ఖడ్గమృగం, అడవి పందివి అయ్యి ఉండొచ్చు. మూడు, అది కళాకారుడి యొక్క ఊహాసృష్టి అయ్యుండొచ్చు. ఊహాజనిత కళలు మానవుని మేధోశక్తికి ఒక నిదర్శనం.
డైనోసార్ల ప్రస్తావన మన పురాణాల్లో లేవు, అటువంటి ప్రస్తావనలు ఊహ, లేక దగ్గరి పోలికలలో ఉన్న జంతువులు అని ఒప్పుకున్నంత మాత్రాన మనకొచ్చే నష్టం ఏమి లేదు.
Comments
Post a Comment