ఏప్రిల్ 1 నాడు మీరు ఫూల్ అయిన సందర్భాల్లో మరచిపోలేనిది ఏది?

 ఫూల్స్ డే రోజున గంపగుత్తగా క్లాస్ మొత్తం అందర్నీ ఒకేసారి ఫూల్ చేసాడు నా స్నేహితుడొకడు.

ఏడో తరగతి చదువుతున్న రోజులవి. ఆ రోజు మొదటి పీరియడ్లో తెలుగు మాస్టారు పాఠం చెబుతున్నారు. ఇంతలో ఉన్నట్టుండి మా స్నేహితుడు లోవరాజు అప్పుడే క్లాసులోకి వస్తూ గుమ్మం దగ్గరనుండి లోపలికి పడిపోయాడు. కంగారుపడిపోయిన మాస్టారు కుర్చీలోంచి లేచి వాడ్ని లేపమని ముందు కూర్చున్నవాళ్ళకి చెప్పి ఆయనకూడా దగ్గరకొచ్చి చూస్తే వాడి మొహం నిండా రక్తం, చొక్కా నిండా రక్తపు మరకలు. సైకిలు స్టాండ్ వేస్తుంటే చెట్టు కొమ్మ విరిగిపడిందని మూలుగుతూ చెప్పాడు. మాస్టారితో సహా క్లాసులో ఉన్న అందరూ నమ్మేశారు. మేమంతా వాడి చుట్టూ ఈగల్లాగా మూగి చూస్తున్నాం. మాస్టారు ఇంకో అబ్బాయికి ఆయాని పిలవమని కబురుపంపారు. ఇంతలోనే అనుమానం కలిగి బాగా దగ్గరకొచ్చి పరీక్షించి చూస్తుంటే పడుకున్న వాడు లేచి "ఏప్రిల్ ఫూల్స్" అన్నాడు. మేమందరం మోసపోయాం అనుకున్నాం. మాస్టారికి చిర్రెత్తుకొచ్చిందికాని ఏమి అనలేదు.

మళ్ళీ తరువాతి సంవత్సరం, మళ్ళీ అదే రోజు, మళ్ళీ అదే రక్తం(ఇంట్లో తిలకం సీసా). మళ్ళీ అలాగే పడ్డాడు. కాకపోతే ఈసారి రియాక్షన్ మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా వచ్చింది. ఆ రెండో సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ మొన్నే మీమ్ కూడా చేశా.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?