2021లో మీరు చేసిన అత్యంత సహాయకరమైన పని ఏమిటి?
2021లో నా తమ్ముడి పెళ్లి. వెళ్ళలేదు. వెళ్లే అవకాశం ఉన్నా వెళ్లకూడదని నిర్ణయించుకుని యూట్యూబ్ లైవ్లో చూసి కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఇంకేం చెయ్యలేకపోయాను.
2020లో బుక్ చేసిన విహారయాత్ర తేదీలు మారి 2021కి వచ్చింది. ఈసారి వెళ్లకపోతే టికెట్ డబ్బులు హోటల్ డబ్బులు రెండూ పోతాయి. వదిలేసాము.
వాక్సిన్ ఇంకా తీసుకోలేదన్న వంకతో కంపెనీ ఈవెంట్లు, స్నేహితుల ఈవెంట్లు ఎగ్గొట్టేసాం.
ఈ పనులన్నిటిలో నా/నా కుటుంబ స్వార్ధం 90 శాతం అయితే, వేరే కుటుంబాల గురించి ఆలోచించింది 10 శాతం. ఆ పది శాతం మాత్రమే నేను చెయ్యగలిగిన సహాయకరమైన పని.
Comments
Post a Comment