2024లో భారతీయ జనతా పార్టీని, అంతకన్నా ముఖ్యంగా నరేంద్ర మోడీని జాతీయ స్థాయిలో సవాలు చేయగల పార్టీ, నాయకులు ఎవరు? ఎందుకు?

 పార్టీపరంగా చూస్తే ఈ రెండేళ్లలో పరిస్థితులు తలకిందులైతే తప్ప 2024లో కూడా బీజేపీని సవాలుచేసే పార్టీ కనిపించడంలేదు. కానీ నాయకుడిపరంగా చూస్తే నరేంద్రమోడీని సవాలు చేసే రాజకీయనాయకుడు ఉన్నాడని చెప్పుకోవచ్చు. అతనే యోగి ఆదిత్యనాథ్.

అదేంటి వారిద్దరూ ఒకే పార్టీలో ఉన్నవారు, అందులోనూ ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉండవు కదా అనే అనుమానం వస్తే అసలు బీజేపీ పార్టీ బలాబలాల గురించి మాట్లాడుకోవాలి.

బీజేపీ ఒక జాతీయవాద పార్టీ. ఇంకా కచ్చితంగా చెప్పుకోవాలంటే హిందుత్వ జాతీయవాద పార్టీ. బీజేపీ సంస్థాగత ఓటు బ్యాంకులో అతి ముఖ్యమైనవారు హిందుత్వ మతవాదులు. భారతదేశం ఒక హిందూ రాజ్యంగా ప్రకటింపబడాలనేదే వీరి ప్రధాన ఎజెండా. వీరిలో అల్ట్రా రైట్ వింగ్ అయితే మనుస్మృతిని మన రాజ్యాంగంగా అనుసరించాలి అంటుంటారు.

అటువంటి అభిప్రాయాలు ఉన్నవారు ప్రస్తుతం నరేంద్రమోడీ విధానాలతో కొంచెం అసంతృప్తిగా ఉన్నారనేది బీజేపీ అభిమానులు కూడా ఒప్పుకునే విషయం. దానికి కారణం హిందూ రాజ్య సాధించడానికి మోడీ సరైన ప్రయత్నం చేయట్లేదని వీరి భావన. ప్రస్తుతమున్న బీజేపీ నాయకులలో అల్ట్రా రైట్ వింగ్ భావాలను కొంతమేరకు ధైర్యంగా చెప్పగల నాయకుడు యోగి ఆదిత్యనాథ్ మాత్రమే. అందులోనూ వీరు యోగిని మనుధర్మం ప్రకారం రాజ్యపాలనకు అర్హత గల వర్గానికి చెందినవాడిగా చూస్తుంటారు.

2022 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తే 2024 నాటికి ప్రధానమంత్రి పదవికి యోగి పోటీదారు అయ్యే అవకాశం లేకపోలేదు. అందులోనూ నరేంద్రమోదీ కూడా ఈ మార్పుకి సమ్మతించవచ్చు లేక ఆయనే స్వయంగా ప్రతిపాదించొచ్చని నా అభిప్రాయం. చైనాను పోలిన విమానాశ్రయాలు, హైవేలు, గోరాజకీయాలు, యోగి చరిష్మా, గత 4 నెలలుగా మారని పెట్రోల్ రేట్లు, బీజేపీ-ఎంఐఎం నాయకుల ప్రసంగాల బట్టి, స్వతంత్ర సంస్థల అభిప్రాయ సేకరణను కూడా చూస్తుంటే ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ విజయం నల్లేరు మీద నడకలాగానే అనిపిస్తుంది. బహుశా 2024లో మనం కొత్త ప్రధానిని చూడబోతున్నామేమో!

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?