మీరు విన్న విచిత్రమైన ఊరి పేర్లు ఏమిటి?
భీమవరం నుండి కాళీపట్నం వెళ్లే దారిలో తగిలే కొన్ని ఊరిపేర్లు కొంచెం విచిత్రంగా ఉంటాయి.
దెయ్యాలతిప్ప [1] : పేరుకే దెయ్యాలతిప్ప గాని ఊరు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది.
దారితిప్ప [2] : ఇది మా మేనమామ ఊరు. ఈ మధ్య రోడ్డు వేసారుగాని ఒకప్పుడు ఈ ఊరికి వెళ్లాలంటే దారిలేక తిప్పలు పడాల్సొచ్చేది.
నీటితిప్ప : విచిత్రంగా ఈ ఊళ్ళో నీటి సమస్య ఎక్కువ. బోరువేస్తే ఉప్పు నీరు పడుతుంది.
అలాగే ఆ చుట్టుపక్కల ఇంకా చాలా తిప్పలు ఉన్నాయి. మర్రితిప్ప, వరతిప్ప లాంటివి.
Comments
Post a Comment