మోడీ ప్రభుత్వం మధ్య తరగతి వారిని మరింత పేదలు గా చేస్తున్నదా?
లేదు.
కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మనదేశంలో అతి పెద్ద వర్గమైన మధ్యతరగతి స్థితిగతులను పైకి తీసుకొచ్చే విధానం కూడా అమలుచేయట్లేదని చెప్పుకోవచ్చు.
ప్రపంచంలోని ఏ రాజకీయ పార్టీకైనా ఆర్థిక వ్యవస్థను నడిపేందుకు కొన్ని సైద్ధాంతిక విధానాలు ఉంటాయి. అలాగే మనదేశంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరించే విధానం కన్సర్వేటివ్ కాపిటలిజం. ఆర్థిక వ్యవస్థలలో మిగిలినవాటితో పోలిస్తే తక్కువ లోపాలున్నదానిని ఎంచుకోవాలంటే నా అభిప్రాయంలో కాపిటలిజం అని అంటాను. కానీ దీనిలో కూడా చెప్పుకోదగ్గ లోటుపాట్లు కనిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏనుగు తొండం ఒంపులాగ కనిపించే ఈ క్రింది రేఖాచిత్రం. కాపిటలిస్ట్ దేశాల్లో అధికారంలో ఉండే ప్రభుత్వం కార్పొరేట్లకు వంత పాడితే ఏం జరుగుతుందో, అమెరికా మొదలగు దేశాల్లో గత నలభై ఏళ్లలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా మెరుగయ్యాయో ఈ గ్రాఫ్ తెలియచేస్తుంది.
పై గ్రాఫులో x-అక్షం మీద ఉన్నది పెర్సెంటైల్ ప్రకారం ఆదాయం వర్గాల సమూహాలు, y-అక్షం మీద ఉన్నది ఆదాయవర్గాల్లో పెరిగిన ఆదాయ శాతం. ప్రభుత్వం కార్పొరేట్ల పక్షం వహించి వాటికి అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల వివిధ దేశాల్లో పేదవారి స్థితిగతులు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. వారితో పోలిస్తే దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల పరిస్థితులు ఏమంత గొప్పగా లేవు. కానీ ఈ కార్పొరేట్ విధానాల వలన అత్యధికంగా లాభపడింది మాత్రం ధనిక వర్గాలే. వారి ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ధనిక వర్గాల్లో కూడా వారు ఎంత ధనవంతులైతే వారి ఆస్తి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఉదాహరణకు పై గ్రాఫులో అట్టడుగు పది శాతం ప్రజలకు నలభై ఏళ్లలో 120% ఉంటే టాప్ 1% ధనవంతుల ఆస్తి 230% పెరిగింది. ఇక మధ్యతరగతి కుటుంబాలకు 50% పెరిగింది.
అసలు ప్రశ్న మనదేశం గురించి కాబట్టి ఆ విషయాలగురించి ఆరా తీస్తే గత ఆరేళ్లలో మన పరిస్థితి ఈ విధంగా ఉంది.[2]
2016 నుండి 2019 మొదటి వరకూ మనదేశ జీడీపీలో పెరుగుదల ఉంది. 2019 మొదట్లో కోవిడ్ సంక్షోభానికి ముందే జీడీపీ పెరుగుదల రేటు పడిపోవడం మొదలయ్యింది. దానికి తోడు పులి మీద పుట్రలాగా కోవిడ్ వచ్చిపడడంతో మరింత పతనమయ్యింది. ఇటువంటి కఠిన పరిస్థితులలో కూడా మనదేశ పౌరులైన అంబానీ, అదానీలు పోటీపడి మరీ మెరుగైన ప్రదర్శన చెయ్యడం, అందులోనూ ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతులవ్వడం భారతీయులుగా మనకెంతో గర్వకారణం.[3]
ఏ దేశంలోనైనా ప్రజలను పేదరికం నుండి బయటపడేయడానికి అతి ముఖ్యమైన ఆయుధం చదువు. కన్సర్వేటివ్ కాపిటలిస్ట్ విధానం వల్ల పెరిగిన ఆదాయం, పెట్రో పన్నులు ద్వారా పెరిగిన ఆదాయాన్ని ప్రభుత్వం దేశంలోని విద్యావ్యవస్థ కోసం ఈ క్రింది విధంగా ఖర్చుపెట్టింది.[4]
ఇక మధ్యతరగతి స్థితిగతులను మార్చే ప్రయత్నంలో దేశంలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరిచిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ విషయం స్వయానా కేంద్రమంత్రుల మాటల్లోనే తెలుస్తుంది.[5] మోడీగారు ప్రారంభించిన ఈ విమానాశ్రయం మనదేశంలోని మిగతా విమానాలను తలదన్నేలా ఉంది. అంతేకాక ఇది చైనాలోని బీజింగ్ విమానాశ్రయాన్ని పోలి ఉండడం గమనార్హం.
ఇక ఏ తరగతి ఏ విధంగా ఉందొ పూర్తి సమాచారం 2022లో లెక్కకట్టబడే గిని కోఫిషియంట్ వివరాలలో తెలుస్తుందని అనుకుంటున్నాను.
Comments
Post a Comment