ఇంతకు మించిన హిపోక్రసీని ఈ జన్మలో చూడలేను ' అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించి ఉంటే ఎవరిని చూసి, ఎందుకు అనిపించింది?

 హిపోక్రసిని గమనించడం కొన్ని సందర్భాల్లో చాలా సులువు. చూసిన, విన్న క్షణంలోనే అర్ధం అయిపోతుంది. అటువంటి సందర్భాలు అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి.

బాహుబలి సినిమా మా ఊళ్ళో ప్రదర్శింపబడేటప్పుడు ఊళ్లోని భారతీయులందరూ వచ్చారు. అందులో తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్న తెలుగబ్బాయి కూడా ఉన్నాడు. అతన్ని పరిచయం చేస్తూ ఒకరిద్దరు తెలుగువాళ్లు తెలుగోళ్ల సత్తా నిరూపించాడని పొగిడారు. కట్ చేస్తే రెండేళ్ల తర్వాత ఒక భారతీయ అమ్మాయి స్వీడిష్ అబ్బాయిని ఇష్టపడి కలిసి జీవించడం మొదలుపెట్టారు. ముందు ఆ తెలుగబ్బాయిని ఆకాశానికెత్తేసిన జనాలే ఇక్కడ ఈ అమ్మాయి చెయ్యరనిపని చేసినట్లు చెవులు కొరుక్కున్నారు. ఆ అబ్బాయి చేసిన గొప్ప పనే ఆ అమ్మాయి దగ్గరకొచ్చేసరికి తప్పుడుపనయ్యింది.

ఇక నాలోని హిపోక్రసీ గురించి కూడా చెప్పుకోవాలి కదా. కులాల గురించి చాటభారతాల స్పీచులు దంచికొట్టేసే నేను చివరికి తల్లిదండ్రులు చూపించిన కుల వివాహమే చేసుకున్నాను.

పైన చెప్పిన రెండు ఉదాహరణల్లో హిపోక్రసీని గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. చూస్తేనే అర్ధం అయిపోతుంది. కానీ ఇంకొక కేటగిరీ ఉంది. అందులో ఉన్న హిపోక్రసీ అర్ధం చేస్కోవడం కష్టం. ఒకవేళ చేసుకున్నా ఎదిరించి మాట్లాడలేము. ఒకవేళ మాట్లాడినా వాదించి గెలవలేము. అలాంటిదానికి ఒక ఉదాహరణ ఈ క్రింది స్క్రీన్షాట్.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?