ఈ ప్రశ్న అసంపూర్తిగా తరతరాలుగా అలాగే మిగిలిపోయింది మీకు తెలిసి ఉంటే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలరు. "చెట్టు ముందా విత్తు ముందా?"
చెట్టు-విత్తు, కోడి-గుడ్డు లలో ఏది ముందు అనే ప్రశ్నలకు సమాధానం సమాధానం ఒక్కటే. జీవ పరిణామ క్రమంలో వాటిలో ముందు ఏదైతే పరిణామం చెందితే అదే ముందు.
చెట్టు-విత్తులలో తీసుకుంటే సుమారు 45-43 కోట్ల సంవత్సరాల క్రితం ఉద్భవించిన మొక్క జాతులు (భూమిపై వాతావరణాన్ని తట్టుకునేలా పరిణామం చెందిన సముద్రపు మొక్కలు అయ్యుండొచ్చు, లేక భూమిపైనే పరిణామం చెందినది అయ్యుండొచ్చు) కణుపులు, బొడిపెల ద్వారా పునరుత్పత్తి జరిపేవని శిలాజాల పరిశీలన వలన తెలిసింది. అక్కడినుండి క్రమంగా పువ్వు, పండు, విత్తనం తయారుచేసే మొక్కలుగా పరిమాణం చెందడానికి సుమారుగా మరో 15 కోట్ల సంవత్సరాలు పట్టింది. అంటే పండు, విత్తు పుట్టడానికి ముందే చెట్లున్నాయన్నమాట.
కోడి-గుడ్డు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పక్షులు పూర్వజాతి దశలో ఉన్న జీవులు పొరలేని/పల్చటి పొర ఉన్న గుడ్లను నీటిలో వదలడం ద్వారా పునరుత్పత్తి చేసేవి. అక్కడినుండి గట్టిపెంకు గుడ్లు పెట్టేజీవులుగా పరిణామం చెందాయి. ఆ తరువాత ఎప్పటికోగాని పక్షిజాతులు పరిణామం చెందలేదు. అందుకే కోడి-గుడ్డు విషయంలో ఆ అంచనా వెయ్యడం కష్టమౌతుంది.
Comments
Post a Comment