మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు?

 ఇదిగో! వీటి గురించే చెప్పాలనుకుంటున్నాను.

ఒకప్పుడు ఎక్కడోగానీ కనిపించని ఈ mspaint కళా-అఖండాలు ప్రస్తుతం ప్రతీ సోషల్ మీడియా ప్లాటుఫారంలో కలదిరుగుతున్నాయి. పై చిత్రంలో కొంచెం తక్కువ ప్రదేశం కనిపిస్తుందిగాని కొన్ని ఫార్వర్డ్ మెసేజులలో ఐరోపా నుండి ఆస్ట్రేలియా వరకూ రంగేసేస్తున్నారు.

వీటి వెనక ఉన్న ఆంతర్యం అందరికీ తెలిసిందే. ఆ పటంలో చూపించినంత భాగంలో కేవలం తమకు నచ్చిన మతం వాళ్ళు మాత్రమే ఉండాలనేది ఆ అతివాదుల కోరిక. అలా అవ్వడం కోసం మిగిలినవాళ్లను కుదిరితే చంపెయ్యాలి, లేకపోతే తరిమెయ్యాలి. వాళ్ళ మనసులో ఉండేది అదే అయినప్పటికీ పైకి చెబితే వాళ్ళను ఉన్మాదులు అంటారేమోనని భయం. ఇంతా చేసి నిజంగానే కొట్టుకుచావల్సిన పరిస్థితోస్తే ఈ ఫోటోలు ప్రచారం చేసేవాళ్ళేమైనా ముందుకొచ్చి నిలబడతారా అంటే అదీ ఉండదు. ఇంట్లో ముసుగుదన్ని పడుకుని అందరూ తన్నుకుచచ్చాక తలకాయలు లెక్కపెట్టుకునే రకాలు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త!

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?