ఏ సినిమా ముగింపు మిమ్మల్ని బాధ పెట్టింది ? సుఖాంతం చేయొచ్చు కదా అని దర్శకుడ్ని తిట్టుకున్న సందర్భాలున్నాయా ?

 కొన్నేళ్ల క్రితం యూట్యూబ్ లో గల్ఫ్ అనే తెలుగు సినిమా చూసాను. మొత్తమందరూ కొత్త మొహాలే. దానికి తోడు ఆ దర్శకుడు ఏయే సినిమాలు తీసాడో కూడా తెలియదు. కేవలం "గల్ఫ్" అనే పేరున్నందుకు మాత్రమే సినిమా చూడాలనిపించింది.

మనదేశంలో ఉపాధి దొరక్క, అరచేతిలో స్వర్గం చూపించే గుంటనక్కల్లాంటి ఏజెంట్ల మాటలు నమ్మి ఎండమావులవంటి గల్ఫ్ దేశానికి వెళ్లిన కొంతమంది యువతీయువకుల కధే ఈ సినిమా. నిర్మాణ పరంగా లోపాలు కనిపిస్తున్నా, అప్పుడప్పుడూ కంటిన్యూటీ లేకపోయినా, కొన్ని సందర్భాల్లో కళాత్మక స్వేచ్ఛ తీసుకున్నాడని తెలుస్తున్నా కేవలం సినిమాలో చూపించిన అంశం నచ్చడం వల్ల సినిమా పూర్తిగా చూడాలని నిర్ణయించుకున్నాను.

దర్శకుడు సినిమాను విషాదాంతంగానే తెరకెక్కించాడు. ఈ సినిమాను ఎక్కువమంది చూసుండకపోవచ్చు కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పలేను. ముగింపు చూసిన తర్వాత ఒక పదినిమిషాలు తిట్టుకున్నాను, ఇలా ఎందుకు చేసాడనుకుంటూ. కానీ సినిమాని సుఖాంతం చేసినట్లయితే ఆ సినిమాని నేనెప్పుడో మర్చిపోయేవాడిని. బహుశా దర్శకుడి ఉద్దేశ్యం కూడా అదేనేమోనని సరిపెట్టుకున్నాను.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?