హిజాబ్ కి మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు?

 మద్దతివ్వడమంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? ఇస్లాంలోని ఆడవారందరూ హిజాబ్, బురఖా ధరించాలనే నియమానికా? లేక హిజాబ్ ధరించను/ధరిస్తాను అనే వ్యక్తిగత ఇష్టానికా? మొదటిదానికైతే అస్సలు మద్దతివ్వను. రెండోదానికి నా మద్దతు అవసరం లేదు.

మతం పేరు, సంస్కృతి పేరు చెప్పి ఎదుటివారు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో చెప్పే గాలి కబుర్లు ఏ మతం చెప్పినా దానితో నాకు ఇబ్బందే. అది హిజాబ్ అయినా, ఘున్ఘట్ అయినా నా దృష్టిలో ఒక్కటే. కానీ ఒక మనిషి స్వయంగా తన మత నియమాలను పాటిస్తానంటే నేను ఆక్షేపించడానికి ఏమి లేదు, అది వారి వ్యక్తిగతం. ఒకవేళ అలా ఆక్షేపించాలంటే దానికంటే ముందు నా మతంలోని నియమాలను ప్రశ్నించుకోవాలి.

ఇక కొంతమంది సన్నాసులు ఉంటారు. వాళ్ళు హిజాబ్ ని వ్యతిరేకించేది దాన్ని ధరించాల్సిన వారి ఇష్టాఇష్టాలను పరిగణనలోకి తీసుకుని కాదు, కేవలం వారి మతం కానివారి మీద ఉన్న ద్వేషం మాత్రమే. అదే వాళ్ళ మతాచారాలను ప్రశ్నిస్తే దాని వెనక ఒక "సైంటిఫిక్" కారణం పుట్టించి మరీ చెబుతారు. ఇలాంటివాళ్ల అభిప్రాయాలు తలకెక్కించుకుంటే మన పిల్లలు కూడా ప్రస్తుతం కర్ణాటకలో కాలం చెల్లిన ఒక ఆచారానికి వ్యతిరేకంగా కాలం చెల్లిన మరొక ఆచారం పాటించే కుర్ర సన్నాసుల్లాగా తయారవుతారు.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?