పెట్రోల్ ధర ఎప్పుడు తగ్గుతుంది?
పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతుందో ఈ క్రింది ప్రశ్నకు సమాధానంగా రాసాను. ధర ఎందుకు తగ్గుతుందో తెలుసుకునే ముందు ఎందుకు పెరుగుతుందో తెలుసుకుంటే ఈ సమాధానం మరికొంత సులభంగా అర్ధమయ్యే అవకాశం ఉంది.
పెట్రోల్ ధర పెరుగుదలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితనంపై కోరాలో చర్చించీ, చర్చించీ అలసిపోయి చివరికి ఒక పట్టిక తయారుచేసుకుని ముందుకురావలసివచ్చింది.
పై పట్టికలో మార్పు అనే నిలువుగడిలోని అంకెలు మన పెట్రోల్ రేట్ పెరగడానికి, తగ్గడానికి కారణమవుతాయి. మార్పు పచ్చ రంగులో ఉంటే మనకు పెట్రోల్ ధర తగ్గుతుంది. మార్పు ఎర్ర రంగులో ఉంటే మనకు ధర పెరుగుతుంది.
2014 ఆగష్టుతో పోలిస్తే 2021 అక్టోబర్లో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గాయి కానీ మనకు మాత్రం పెట్రోల్ ధర పెరిగింది. దానికి కారణం పెరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సుంకాలు. కేంద్రం విధించే ఎక్సయిస్ సుంకం 247 శాతం పెరిగి 32.9 కి చేరుకుంది. 2014-2015లో ఈ సుంకం మొత్తం వసూలు 75 వేల కోట్లు ఉంటే, 2020-2021 మొదటి తొమ్మిది నెలల్లోనే దాదాపు 3 లక్షల కోట్లకు పెరిగింది. [1]
సుంకాల పెంపులో రాష్ట్రప్రభుత్వాలు కూడా తక్కువ తినలేదు. ఉదాహరణకు కేంద్రం విధించే సుంకంతో కలుపుకుని ఉన్న ధరపై ఆంధ్రప్రదేశ్ విధించే వ్యాట్ గత ఆరేళ్లలో 33% పెరిగితే మూలధరపై లెక్కవేస్తే 83% పెరిగింది.
ఈ లెక్కలన్నీ ఆగష్టు 2014, అక్టోబర్ 2021 లో ఉన్న అంతర్జాతీయ, దేశీయ ధరలను ఆధారంగా తీసుకుని రూపొందించినవి.
ఫుట్‌నోట్స్
పైన చెప్పినట్లు పెట్రోల్ ధరలో ముఖ్య పాత్ర పోషించేవి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు, మనదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సుంకాలు. పెట్రోలు జీఎస్టీ పరిధిలో లేదు కాబట్టి దాని మీద విధించే సుంకాలను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖర్చులకు అనుకూలంగా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. అంటే అంతర్జాతీయంగా పెట్రోల్ రేట్లు తగ్గినా, లేక మన దేశ, రాష్ట్ర సుంకాలు తగ్గినా మనకు పెట్రోల్ రేటు తగ్గుతుంది.
ఉదాహరణకు 2019 నుండి 2020 వరకూ అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర విపరీతంగా పడింది.[1]
కానీ విచిత్రంగా మనదేశంలో మాత్రం ధరలో ఎటువంటి మార్పు రాలేదు. దానికి కారణం దేశంలో స్థిరంగా ప్రస్తుత ధరనే కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సయిస్ సుంకాన్ని అమాంతం పెంచేసింది. మనకు ధరలో మార్పు రాలేదు కాబట్టి మన దైనందిక జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు. [2]
అయితే అంతర్జాతీయ మార్కెట్లో రేటు పెరిగినప్పుడు మాత్రం దానికనుకూలంగా పెంచిన సుంకాలు తగ్గించలేదు. దీనికి తోడు దొరికిందే సందని రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు వ్యాట్, సెస్ వడ్డించాయి. ఈ కారణాలతో పెట్రోల్ రేట్లు 100 దాటేసింది.
కానీ ఉన్నట్లుండి నవంబర్ 2021లో కేంద్ర ప్రభుత్వం అప్పటికే వసూలు చేస్తున్న 32 రూపాయలలో 5 రూపాయలు తగ్గించింది. బీజేపీ ప్రభుత్వానికైతే మరో ఆరు నెలల్లో అతి ముఖ్యమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలున్నాయి కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంది గాని ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ఇప్పుడేమి ముఖ్యమైన ఎన్నికలు లేకపోవడంతో ఆ ప్రభుత్వాలేమి తగ్గించలేదు. [3]
మొత్తంగా చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు తగ్గితే మనదేశంలో పెట్రోల్ ధర కొద్దిగా తగ్గుతుంది. దగ్గర్లో ఏమైనా ముఖ్యమైన ఎన్నికలు ఉంటే ఎక్కువగా తగ్గుతుంది.
కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచేస్తున్నాయని బాధపడిపోనవసరం లేదు. కేవలం దేశ ప్రజల మంచికోసమే ఇదంతా అని కేంద్ర మంత్రి సెలవిచ్చారు. [4]
Comments
Post a Comment