మీకు ఏ గుడిలో ప్రసాదం అంటే ఇష్టం?

 రాజమండ్రిలో ఒక పెద్ద గుడిలో పెట్టే పులిహోర తప్ప నాకు మిగతా అన్ని ప్రసాదాలూ ఇష్టమే. వాటిలో బాగా ఇష్టమైనవైతేమాత్రం శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం, అన్నవరం ప్రసాదం, విజయవాడ దుర్గమ్మ గుడి పులిహోర, తిరుపతి లడ్డూ అంటే ఇష్టం.

మా ఊళ్ళో ప్రతి సంవత్సరం వందలమంది స్వామిమాలలు వేసుకుంటారు. అందులో శబరిమల వెళ్లేవాళ్లే ఎక్కువ. మా నాన్నగారికి తెలిసినవాళ్ళు, నా స్నేహితులు ఎవరైనా వెళ్తే ఇంటికి రెండు డబ్బాలు పంపేవారు. అందులో ఒకటి నేనే లేపేసేవాడ్ని. ఈ ప్రసాదం తిని పదేళ్ళయ్యుంటుంది. తిరుపతి లడ్డూ కూడా అంతే.

విస్తరాకుల్లో చుట్టి ఇచ్చే అన్నవరం ప్రసాదం అంటే అదో వల్లమాలిన ఇష్టం. ఇంట్లో వండడానికి ప్రయత్నించారుగాని ఆ రుచి రాలేదు.

మా నాన్నగారు భవానీమాల వేసుకునేవారు. మాల వేసుకున్నా లేకపోయినా ప్రతిసంవత్సరం విజయవాడ ప్రయాణం మాత్రం ఖచ్చితంగా ఉండేది. తిరిగొచ్చేటప్పుడు బ్యాగ్ నిండా పులిహోర ప్యాకెట్లే.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?