రైల్వే టికెట్ కలెక్టర్లు ప్రయాణికులతో ఎలా వ్యవహరిస్తారు?

 ముందుమాట: నేను కేవలం ఒక రైల్వే టికెట్ కలెక్టర్ గారు అన్నమాట చెబుతున్నాను. ఈ సమాధానం భీమవరం వాళ్ళని గిల్లడం కోసం కాదు, పైగా మా అమ్మగారి పుట్టిల్లు కూడా భీమవరమే అని తెలియచేస్తూ.. సమాధానం లోకి.

చెన్నై, రాజమండ్రి మధ్య ప్రయాణ తేదికి దగ్గర్లో రిజర్వేషన్ దొరికే అవకాశం ఉన్న ఒకే ఒక్క రైలు సర్కార్ ఎక్సప్రెస్. ఒకసారి అలాగే రాజమండ్రి నుండి చెన్నై వెళ్ళడానికి బెర్త్ రాక RAC లో ఉన్నాను. ఆ బోగిలో మొదట RAC సీటు నాదే కావడంతో విజయవాడ వచ్చేలోపు బెర్త్ వచ్చేస్తుందనిపించింది.

భీమవరంలో అప్పుడే వచ్చిన టికెట్ కలెక్టర్ గారు నా టికెట్ చూసి వెళ్లిపోతుంటే బెర్త్ ఏమైనా ఉందేమోనని అడిగాను. ఖాళీగా ఉంటే ఫస్ట్ నాకే వస్తుందని చెప్పి పక్కవారి టిక్కెట్లు చూస్తున్నారు. ఇంతలో చేతికి పెద్ద పెద్ద ఉంగరాలు ఉన్న ఒక పెద్ద మనిషి జేబులోనుండి ఐదువందలనోటు, జనరల్ టికెట్ ఇచ్చి బెర్త్ కావాలని అడిగాడు. వెంటనే టికెట్ కలెక్టర్ "మీ భీమవరం వాళ్లు చేపలచెరువులూ, రొయ్యల చెరువులూ, కప్పల చెరువులూ వేసేసి అలా వచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇలా జనాల మీద పడి ఎక్కుతున్నారు. జనరల్ టికెట్ తో నీకు బెర్త్ ఇస్తే RAC లో ఉన్నవాళ్లు నేల మీద నిద్రపోవాలా?" అని అడిగారు.

కత్తివేటుకి నెత్తురు చుక్క లేదు అనే సామెతకి అంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ చూడలేదు నేను. కానీ మరీ అంత కఠినంగా చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?