భగవంతుణ్ణి చాలా మంది నమ్మటం లేదు,ఎందుకు?

 ఆస్తికులకు వారి మతం తప్ప మిగిలిన అన్ని మతాలతో ఉన్న ఇబ్బంది నాస్తికులకు ప్రతీ మతంతోను ఉంటుంది.

  • నేను వ్యక్తిగతంగా మతక్రతువులకు దూరంగా ఉండడానికి కారణం వాటిలో నాకు ద్వంద్వప్రమాణాలు ఉన్నట్లు అనిపించాయి.
  • వ్యక్తిగత అభిప్రాయాలకు, ప్రశ్నలకు మతంలో తావులేదనిపించింది. ఎందుకు అని అడిగితే చాలు, కొంతమంది పాపులు అంటారు, మరికొంతమంది మనోనేత్రం తెరుచుకోలేదు అంటారు.
  • ఎవరైనా ఒకరు తమ మతాచారాలనుండి కొంచెం దూరంగా జరిగితే ఇక బెదిరింపులు మొదలైపోతాయి. వాళ్ళని కొంతమంది నరకానికి వెళ్తావని బెదిరిస్తే, మరికొంతమంది మళ్ళీ మళ్ళీ పుడతావని భయపెడతారు. ఇటువంటి బెదిరింపులన్నీ ఎక్కువమందిని ఆస్తికులుగా ఉంచగలుగుతుంటే, మరికొంతమందిని ఇంకా హేతువాదులుగా మారుస్తున్నాయి.

అదనపు ఆలోచన:

ఆ మధ్య "ఎవరికీ చెప్పొద్దు" అనే తెలుగు సినిమా చూసినప్పుడు తన కులస్తులే గొప్పోళ్ళు అని నమ్మే ఆ పెద్దాయన పరిస్థితిలో తమ ఆచారాలే గొప్పవి అనుకునేవాళ్ళు ఉంటే వాళ్ళ స్పందన ఎలా ఉంటుందా అనే ఊహాత్మక ఆలోచన వచ్చింది.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?