ఒకవేళ భారతదేశంలో హిందువుల కన్నా క్రైస్తవులు గాని, ముస్లిములు గాని జనాభా పెరిగితే అప్పుడు కూడా భారతదేశం లౌకిక దేశంగా కొనసాగుతుందా?
ఈ ప్రశ్నలో నిగూఢంగా దాక్కున్న ఉద్దేశ్యపరంగా చెప్పాలంటే కొనసాగదు.
మనదేశంలో ఒక మతం "మా మనోభావాలు దెబ్బతింటున్నాయి" అంటే దానికి పోటీగా ఇంకో మతం "కాదు, మా మనోభావాలే దెబ్బతింటున్నాయి" అని కొట్టుకు చచ్చే ప్రస్తుత పరిస్థితులను చూస్తే మెజారిటీలో ఏ మతమున్నా, అధికారంలో ఏ పార్టీ ఉన్నా భారతదేశం లౌకికదేశంగా కొనసాగే అవకాశం కనిపించట్లేదు. పైగా మనదేశంలో ఎక్కువమంది కోరుకునేది ఇదే కదా!
మైనారిటీలను బుజ్జగించే కార్యక్రమాలు చేస్తే నా నాలుగు ఓట్లు నాకు పడిపోతాయి అనుకునే తెలివితక్కువ పార్టీలు కొన్నైతే, మెజారిటీ ప్రజలను రెచ్చగొడితే ఇంకా ఎక్కువ ఓట్లు పడతాయి అనుకునే అతితెలివి పార్టీలు మరికొన్ని. లేచిన దగ్గర్నుండీ, ఆఖరికి నిద్రలో కూడా మన రాజకీయాలు మతం చుట్టూనే తిరుగుతున్నాయి. మతం పేరు లేకుండా మనదేశంలో రాజకీయం చేయని పార్టీ గురించి నాకైతే తెలియదు. ఈ మతరాజకీయ గోదారిని ఈదడానికి కుక్కతోకలాగా ప్రస్తుతానికి నోటా అనే ఒక గుర్తు కనిపిస్తుంది.
Comments
Post a Comment