ఎదుటివారు మాట్లాడేటప్పుడు మీరు ఒక పదం బదులు ఇంకొక పదం అర్థం చేసుకుని పొరబడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
ఫోటో తీసేవాళ్ళు లేకపోతే సెల్ఫీ తీసుకున్నట్లు నాకు గుర్తున్న ఒక పిచ్చి అనుభవం రాద్దామని ఈ ప్రశ్న నేనే అడిగాను.
నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నా స్నేహితుల రూంకి ఎక్కువగా వెళుతుండేవాడిని. ప్రతీ బ్యాచ్లోనూ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటాడు, అలాగే మా బ్యాచ్లో కూడా తగలడ్డాడు. ఆరోజు పులి సినిమా విడుదలైతే వాడు కాలేజ్ మానేసి సినిమాకి వెళ్ళిపోయాడు. మేము క్లాసులో ఉన్నప్పుడే సినిమా బాలేదని తెలిసి సాయంత్రం వాడిని ఏడిపించొచ్చని రూంకి వెళ్ళాము.
"సినిమా ఎలా ఉంది రా?" అని మాలో ఒకడు అడిగాడు.
"బాలేదురా! మొదట్నుండి చివరిదాకా సంకలు పెంచమని స్పీచులిచ్చేసాడు" అని వాడు సమాధానం చెప్పాడు.
"ఈ సంకలు పెంచడం ఏంటి? కొత్త ఎక్సరసైసా?" ఏడుపు మొహం పెట్టుకున్నవాడిని ఇంకొక స్నేహితుడు అడిగాడు.
"సంకలు పెంచడం కాదు రా నీ అయ్యా! సంకల్పించడం". అసలే తిక్కమీద ఉన్న ఆ సినిమాభక్తుడు మండిపడిపోయాడు.
Comments
Post a Comment