తమ పిల్లలకు రక్తమార్పిడిని తిరస్కరించడానికి యెహోవా సాక్షులకు వీలు కల్పించాలా?

 మతాచారాలను, నమ్మకాలను, సంస్కృతిని ఆధారంగా చేసుకుని వ్యక్తి ప్రాణానికి, మానవ హక్కులకు (ఇదే ప్రాధాన్యతాక్రమంలో) హాని కలిగించే ఎటువంటి వెసులుబాటునైనా కల్పించడానికి వీల్లేదు. అది ఇస్లాంలో ముమ్మారు తలాక్ అయినా, యెహోవా సాక్షుల పిల్లల రక్త మార్పిడి వైద్యమైనా, హిందూమతంలో కులంపేరుతో దేవాలయ ప్రవేశం నిషేదించడమైనా. ఇటువంటి ఆచారాలను వ్యతిరేకిస్తే సంతోషం. ఆ వ్యతిరేకతకు కారణం పరాయి మతస్తులకు ఉన్న వెసులుబాటుపై అసూయ కాక, ఆ వెసులుబాట్ల వల్ల బాధింపబడేవారిపై సానుభూతి అయితే ఇంకా సంతోషం.

ఇక రక్తమార్పిడి విషయానికొస్తే అత్యవసరమైన సందర్భంలో కూడా రక్తమార్పిడి వద్దనే అధికారం పూర్తి మతి స్తిమితంలో ఉన్న వయోజన వ్యక్తికి ఉంటుంది. కానీ పిల్లల విషయంలో ఆ అధికారం తల్లిదండ్రులకు లేదు. ఎందుకంటే పిల్లల నిర్ణయాలపై అధికారం తల్లిద్రండులున్నప్పటికీ అది సంపూర్ణాధికారం కాదు, కేవలం వారి సౌలభ్యాల విషయంలో మాత్రమే నిర్ణయం తీసుకునే అధికారం. కనీస అవసరాలైన తిండి, బట్ట, వైద్యం, విద్య విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వజోక్యం తప్పనిసరి కావాలి. అలా చెయ్యడానికి మా మత పుస్తకాలు ఒప్పుకోవని ఎవరైనా అడ్డుపడితే ముందు వాళ్ళని జైల్లో వెయ్యాలి.

మనదేశంలో యెహోవా సాక్షులకు ఈ వెసులుబాటు ఉందని నేననుకోవడం లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా ఇటువంటి సదుపాయం కల్పిస్తామని హామీ ఇస్తే వారికి పిల్లల సంరక్షణ గురించి అవగాహన లేదని అర్ధం.


Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?