భారత దేశంలో తయారయ్యే ఆహార పదార్థాల లో జిలిటన్ ఉన్నవి తెలియజేయగలరు. ఉదా || ఫ్రూటెల్లా ?
జెలటిన్ అనేది రంగు, రుచి, వాసన లేని ఒక పారదర్శకమైన పదార్ధము. దీనిని ఎక్కువగా ఆహారపదార్ధాల తయారీలో జున్ను లాంటి టెక్సచుర్ కోసం ఉపయోగిస్తారు. జెలటిన్ని జంతు అవశేషాలలో ఉండే కొల్లాజెన్ అనే ప్రోటీన్ నుండి తయారుచేస్తారు. దీనికారణంగానే శాకాహారులు, వీగన్లు, మతపరమైన నిషిద్ధ ఆహారాజాబితా పాటించేవారు జెలటిన్ని తినరు. ఆహారపదార్దాల్లో జెలటిన్ని ఉపయోగిస్తే తయారివారు ముందుగా వినియోగదారులకు తెలియచెయ్యాల్సిన అవసరం ఉంది. లేకపోతే వినియోగదారుల విశ్వాసాలకు భంగం కలిగించినట్లే.
మన దేశంలో మార్షమాల్లౌస్ (marshmallows), జెల్లో బిళ్ళలలో జెలటిన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మార్షమాల్లౌస్ వాడకం ఎక్కువగా కెఫెలలో ఒక అదనపు రుచిగా అందిస్తారు. ఇష్టం లేకపోతే అవసరం లేదని చెప్పొచ్చు. విదేశాలలో తయారయ్యి దిగుమతి చేయబడుతున్న ఫ్రూటెల్లా లాంటి జీళ్లలో జెలటిన్ ఉంటుంది. ఖర్చు తగ్గించుకుందామనుకునే బేకరీ ఉత్పత్తుల్లో కూడా జెలటిన్ ఉండే అవకాశం ఉంది. చాలామంది ఐస్ క్రీముల్లో ఉంటుంది అంటారుగాని మనదేశంలో పేరుపొందిన ఐస్ క్రీము ఉత్పత్తులలో జెలటిన్ ఆనవాళ్లు లేవు.
ఒకవేళ జెలటిన్ లేకుండా ఆహార పదార్దానికి సరైన రూపం, మృదుస్వభావం రాదని భావిస్తే మార్కెట్లో వీగన్ జెలటిన్ కూడా కొంచెం ఎక్కువ ధరలో లభ్యమవుతుంది. మా ఇంట్లో కేవలం ఒకే ఒక్క వ్యక్తి కోసం ఇది కొనాల్సొస్తుంది.
కేవలం ఆహారప్రదార్ధాల్లోనే కాక ఔషదాలలో కూడా జెలటిన్ని ఉపయోగిస్తారు. కానీ వాటిగురించి ఆలోచించకపోవడం మంచిది. ముందు ఆరోగ్యం, తరువాతే ఇష్టాలూ అయిష్టాలు.
Comments
Post a Comment