'గురివింద ఈ సమాజము' అంటే ఏమిటి?
మనం చేసే పని మనకు తప్పుగా కనిపించకుండా అదే పని ఎదుటివాళ్ళు చేసినప్పుడు మాత్రం తప్పులెంచేవారి కబుర్లను గురువింద గింజ కబుర్లు అంటారు. ఒక సమాజంలో ఎక్కువమంది అటువంటి మనస్తత్వం వారు ఉంటే దానిని గురువింద ఈ సమాజం అంటారు. మీకు ఇంకా ప్రత్యక్ష ఉదాహరణ కావాలంటే మన చుట్టుపక్కలే చాలామంది ఉంటారు.
ఉదాహరణకు తెలుగు కోరాలో ఇద్దరు వాడుకరుల మధ్య ఏదోఒక విషయంలో వాదన జరిగింది. అందులో ఒక వాడుకరి ఆంగ్లంలో సమాధానమిస్తున్నారు. దానితో చిర్రెత్తుకొచ్చిన మరో వాడుకరి అసలు తెలుగు కోరాలో తెలుగులో మాత్రమే వ్యాఖ్యలు రాయాలని, ఆంగ్లంలో వ్యాఖ్యలు రాసిన వాడుకరి తెలుగువారు అవ్వడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
తెలుగు కోరా కోసం ఆయన చేస్తున్న కృషి చూసి ముచ్చటేసి ఆయన ప్రొఫైల్ చూసాను. తీరా చూస్తే ఆయన కూడా చాలా చోట్ల ఆంగ్లంలో వ్యాఖ్యలు రాసారు.
అంటే ఆయన దగ్గరికొచ్చేటప్పటికి తప్పు కానిది ఆయనకు నచ్చని విషయం మాట్లాడేవాళ్ళదగ్గరికొచ్చేసరికి మాత్రం తప్పయింది. ఇలాంటి ప్రవర్తననే గురువింద గింజ మాటలు అని అంటారు.
Comments
Post a Comment