పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతోంది?
పెట్రోల్ ధర పెరుగుదలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితనంపై కోరాలో చర్చించీ, చర్చించీ అలసిపోయి చివరికి ఒక పట్టిక తయారుచేసుకుని ముందుకురావలసివచ్చింది.
పై పట్టికలో మార్పు అనే నిలువుగడిలోని అంకెలు మన పెట్రోల్ రేట్ పెరగడానికి, తగ్గడానికి కారణమవుతాయి. మార్పు పచ్చ రంగులో ఉంటే మనకు పెట్రోల్ ధర తగ్గుతుంది. మార్పు ఎర్ర రంగులో ఉంటే మనకు ధర పెరుగుతుంది.
2014 ఆగష్టుతో పోలిస్తే 2021 అక్టోబర్లో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గాయి కానీ మనకు మాత్రం పెట్రోల్ ధర పెరిగింది. దానికి కారణం పెరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సుంకాలు. కేంద్రం విధించే ఎక్సయిస్ సుంకం 247 శాతం పెరిగి 32.9 కి చేరుకుంది. 2014-2015లో ఈ సుంకం మొత్తం వసూలు 75 వేల కోట్లు ఉంటే, 2020-2021 మొదటి తొమ్మిది నెలల్లోనే దాదాపు 3 లక్షల కోట్లకు పెరిగింది. [1]
సుంకాల పెంపులో రాష్ట్రప్రభుత్వాలు కూడా తక్కువ తినలేదు. ఉదాహరణకు కేంద్రం విధించే సుంకంతో కలుపుకుని ఉన్న ధరపై ఆంధ్రప్రదేశ్ విధించే వ్యాట్ గత ఆరేళ్లలో 33% పెరిగితే మూలధరపై లెక్కవేస్తే 83% పెరిగింది.
ఈ లెక్కలన్నీ ఆగష్టు 2014, అక్టోబర్ 2021 లో ఉన్న అంతర్జాతీయ, దేశీయ ధరలను ఆధారంగా తీసుకుని రూపొందించినవి.
Comments
Post a Comment