ఏ దేశం మీకు దగ్గరగా ఉంది? ఎందుకు?
ప్రయాణం చెయ్యడానికి పట్టే సమయాన్ని లెక్కలోకి తీసుకుంటే డెన్మార్క్ దగ్గరగా ఉంది. మూడు గంటల్లో 250 కి.మీ దూరంలో ఉన్న కోపెన్ హాగన్ ను ప్రజా రవాణా ద్వారా చేరుకోవచ్చు. దీనిని 2024 ఎండాకాలానికి రెండు గంటలలోపు తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేసారు. దీనివల్ల ప్రస్తుత మార్గంలోని రెండు చిన్న పట్టణాలు రైలు మార్గం కోల్పోతున్నారు. అలాగే దూరం 200 కి.మీ కి తగ్గుతుంది.
ఇక దూరం బట్టి చూస్తే మాకు పోలాండ్ దగ్గరగా ఉంది. 190 కి.మీ దూరంలో బాల్టిక్ సముద్రానికి దక్షిణాన గ్-దినియా అనే పోలిష్ రేవు పట్టణానికి సరాసరి ఓడ ప్రయాణం అందుబాటులో ఉంది. పదిగంటల ప్రయాణ సమయం.
Comments
Post a Comment