మీరు చూసిన/తిన్న వాటిలో అత్యంత విడ్డూరమైన కాంబినేషన్‌లు ఏమిటి?

 నేను ఇంతకు ముందు పనిచేసిన ప్రాజెక్ట్లో నా టీం లీడర్ ఒక స్వీడిష్ జాతీయుడు. పని విషయాల్లో మాత్రమే కాకుండా స్వీడిష్ భాష, సంస్కృతీ నేర్చుకోవడానికి ఆఫీసులో పనిచేసే విదేశీయులకు సాయం చేసేవాడు. ప్రతీ శనివారం బయట కాఫీ షాపులో కలుసుకునేవాళ్ళం. ఇంట్లోవారికి ఆసక్తి ఉంటే వాళ్ళని కూడా తీసుకురావొచ్చు.

అలా ఆ కాఫీ సమావేశాలకు నా భార్య కూడా వస్తుండేది. ఒకసారి రెండు దేశాల భోజన సంస్కృతి గురించి మాట్లాడుతూ తనకి దక్షిణ భారతీయ వంటలంటే ఇష్టమని కానీ ఈ దేశంలో అవి దొరకట్లేదని చెప్పాడు. మళ్ళీ కలిసినప్పుడు ఏమైనా వంటకం చేసి తీసుకొస్తానని నా భార్య మాటిచ్చి తర్వాతి సమావేశానికి రొయ్యల కూర చేసిచ్చింది.

తర్వాతి సోమవారం ఆఫీసులో కలిసినప్పుడు కూర ఎలా ఉందని అడిగాను.

"బాగుంది కానీ దేనితోపాటు తినాలో తెలియక అరటిపండుపై పెట్టుకుని తిన్నాను, అది కరెక్టేనా?" అని సమాధానం చెప్పాడు.

అదనం: క్రింద ఒక వ్యాఖ్య చదివాకా, నిన్న జాతి రత్నాలు సినిమా చూసాకా ఆ రెండింటిని కలిపికొట్టి ఊహించిన మీమ్.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?