ఎర్ర నీళ్ళకి చేపలు ఎదురు వస్తాయంటారు, నిజమేనా, ఎందుకు?
తూముల దగ్గర, లాకుల దగ్గర చేపలు పట్టడానికి ఉపయోగించే కిటుకిది. పులస చేపలు పట్టే సమయంలో గోదావరిలో కూడా ఎర్రనీళ్ళు నీటి ప్రవాహం ఉంటుంది.
చేపలు నీటిలోని ఆక్సిజన్ గ్రహించడానికి వాటిమొప్పలగుండా నీటి ప్రవాహం జరుగుతుండాలి. అందుకే చాలా జాతుల చేపలు నీటికి ఎదురీదుతాయి. అంటే ప్రవాహం ఉంటే అది మామూలు నీళ్ళైనా, ఎర్ర నీళ్ళైనా చేపలు ఎదురీదుతాయి. కాకపోతే మనకు వర్షాలు పడి ప్రవాహం పెరిగినప్పుడు సాదారణంగా నదులు, కాలవల్లో నీరు ఎర్రగా అవుతాయి.
Comments
Post a Comment