మీకు ఇంగ్లీషు రానప్పుడు నలుగురితో ఎలా మేనేజ్ చేయాలి?

 భాష రాని పరిస్థితి కేవలం ఆంగ్లం దగ్గరే కాదు. రకరకాల సందర్భాల్లో వేరే భాషలవల్ల కూడా వస్తుంది. ఇలాంటి సందర్భం వస్తుంది అని ఊహించే మనకు రాని భాషలో "ఆ భాష నాకు రాదు" అని ఎలా చెప్పాలో నేర్చుకోవాలి.

ఉదాహరణకు నేను తెలుగు మాధ్యమంలో చదివేటప్పుడు "ఐ నో ఇంగ్లీష్" అని చెప్పేవాడిని. వెంటనే ఎదుటివాళ్ళు "అయితే మాట్లాడొచ్చు కదా!" అనేవాళ్ళు. కానీ నేను చెప్పినది "I no English" అని. కనీసం ఇది కూడా వాళ్లకు అర్ధం కావట్లేదని నేనే దయతలచి ఆంగ్లం నేర్చుకున్నాను.

ఇక భాష పేరెత్తితే యుద్ధాలు చేసే తమిళనాడు వెళ్లాల్సొచ్చినప్పుడు "అది ఎణ్ణనా తలైవా, ఎనకు తమిళ్ కొంజెం కొంజెం మట్టుమ్ తెఱియుం, పేస వరాదు" అని బట్టీ పట్టేసి మా పక్కింటోళ్ళమీద ప్రయోగించా. వాళ్ళు వెంటనే రూంలోకి లాగేసి, పొట్టపగిలేటట్లు చెట్టినాడ్ చికెన్ తినిపించేసి తమిళ క్లాసులతో తలంటి పంపేశారు.

ఇదేదో బాగుంది కదా అనుకుని ఇదే టెక్నీక్ స్వీడిషోళ్ళ మీద వదిలాను. వీళ్ళేమో నాకు స్వెన్స్కము నేర్పుతామని చెప్పి వాళ్ల ఆంగ్లభాషకి ఒక సాధన బంతిలా నన్ను వాడుకుంటున్నారు.

కాబట్టి నేను చెప్పేదేంటంటే "తెలియదు" అని మొదలెడితే మిగిలింది సంఘమే చూసుకుంటుంది.


Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?