మీరెప్పుడైనా పరీక్షల్లో ప్రశ్నకు తగ్గ సమాధానం రాక ఏదిపడితే అది రాసి జవాబు పత్రం నింపేయడం చేశారా ?

 ఇంజనీరింగ్లో అలాంటి విచిత్ర విన్యాసాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ పాఠశాలలో రాసిన ఒక సమాధానం బాగా గుర్తుండిపోయింది. కాకపోతే అది సమాధానం తెలియక రాసిన చెత్త కాదు. హిందీలో కొన్ని పదాలను ఏమంటారో తెలియక పడ్డ అవస్థ.

ఆ ప్రశ్న హిందీ చిన్న-పుస్తకం గురించి అడిగినది అనుకుంటా, సరిగా గుర్తులేదు. ఛత్రపతి శివాజీ జీవితంలోని ఒక అంకం. నేను రాస్తున్న సమాధానంలో రాజు తన సైన్యాధిపతితో మాట్లాడుతూ "నీ అపరాధం నువ్వు తెలుసుకుని, బాధ్యత నుండి తప్పుకో" అన్నట్లు ఒక సంభాషణ ఉంటుంది. దాన్ని హిందీలో ఎలా రాయాలో తెలియక "తుమ్హారా అపరాద్ తుం తెలుసుకుని" అని హిందీ అక్షరాలలో రాసేసి గండం గడిచిందని సంబరపడిపోయాను. తర్వాత క్లాసులో హిందీ మాస్టారు ఆ సమాధానాన్ని నాతోనే చదివించడంతో ఆ పూటకి తోటి విద్యార్థులకు నేనొక ఆటబంతినయ్యాను.

ఆ మధ్యాహ్నానికే నా స్నేహితుడొకడు "The ant was కుట్టింది" అని రాసి నా నెత్తిన పాలు పోసాడు.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?