ఒక సినిమాలో మాత్రమే జరగగలదని మీరు అనుకునేదీ, మీ జీవితంలో జరిగినదీ ఐన ఒక సంఘటన ఏమిటి?
మగధీర సినిమాలోని ఈ సన్నివేశం.
ఏంటి నమ్మకం కుదరట్లేదా? మీమీదొట్టు, నిజంగానే జరిగింది.
చలికాలం దెబ్బకు చిన్న పిల్లలు బయట పార్కుల్లో జారుడుబల్లలు, ఉయ్యాలలు ఆడుకోలేని పరిస్థితి. ఎప్పుడైనా అవకాశం దొరికితే మా అమ్మాయిని మా ఊళ్లోని ఇండోర్ ఆటస్థలానికి తీసుకెళతాం. దానిలో ఉష్ణోగ్రత పదిహేను ఇరవై మధ్యలో ఉంటుంది. ఆ వేడికోసం ఎప్పుడూ హీటర్లు వేసి ఉంచుతారు కాబట్టి గాలి చాలా పొడిగా ఉంటుంది. చలి పెరిగింది కాబట్టి సింథెటిక్ బట్టలు వేసాము.
అక్కడున్న ఆటవస్తువులలో తనకు బాగా నచ్చింది, తను ఎక్కువసేపు ఆడేది జారుడుబల్లపైనే. ఆ నున్నటిబల్ల గట్టి దృఢమైన ప్లాస్టిక్ తో తయారుచేయబడింది. తనను జారుడుబల్ల మీద వదిలేసి నేను కూర్చుని చూస్తున్నాను. పది రౌండ్లు కొట్టేసాక గాలిబంతి దగ్గరికి తీసుకెళ్లమని అడిగింది. లేచెళ్లి చెయ్యందుకున్నానో లేదో ఠా....ప్ మని శబ్దం వచ్చి ఇద్దరికీ షాక్ కొట్టింది. ఇటువంటిది అంతకుముందెప్పుడు తెలియక ఏడుపు మొదలెట్టింది. నేనేం చేసేసానోనని వెనక నుండి రెండు కళ్ళు కోపంగా చూస్తున్నాయి. వెంటనే చంటిదానితోపాటూ నేను కూడా రెండు సార్లు జారుడుబల్ల జారేసి దాన్ని ఓదార్చి వెళ్లి వెనకున్నోళ్లకు చెయ్యిచ్చోచ్చాను.
Comments
Post a Comment