రాందేవ్ బాబాకి వ్యతిరేకంగా భారత వైద్య మండలి (indian medical association) ఆరోగ్యమంత్రిత్వ శాఖకు ఎందుకు ఫిర్యాదు చేయవలసి వచ్చింది?
పతంజలి ఆయుర్వేద్ సహవ్యవస్థాపకుడు రాందేవ్ బాబా ఒక వేదికపై ప్రసంగిస్తూ అల్లోపతి వైద్య విధానాలపై విమర్శలు చేసారు. అల్లోపతిని ఒక మూర్ఖపు శాస్త్రంగా అభివర్ణించిన ఆయన, కోవిడ్కి అల్లోపతిలో చేసే వైద్యవిధానాలు సత్ఫలితాలు ఇవ్వడంలేదని చెప్పి ఒకరకంగా కోవిడ్ మరణాలకు డాక్టర్లను కారణంగా చూపే ప్రయత్నం చేసారు.
ఆ ప్రకటనను అనేకమంది వైద్యులు, శాస్త్రవేత్తలు ఖండిస్తూ ప్రస్తుత పరిస్థితులను తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవడానికే రాందేవ్ ఇటువంటి ప్రకటనలు చేసారని విమర్శించారు. ఢిల్లీకి చెందిన కొంతమంది వైద్యులు రాందేవ్ బాబాపై పోలీసులకు పిర్యాదు చేసారు . వీటికి అదనంగా భారత వైద్య మండలి (IMA) రాందేవ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయనపై అంటువ్యాధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకు పిర్యాదు చేసాయి.[1]
రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ప్రజలలో అల్లోపతిపై భయాందోళలు రేపి, ఆ వైద్యవిధానంపై విముఖత కలిగించి రోగుల ప్రాణాలకే ముప్పు తెచ్చేటట్లు ఉన్నాయనేది భారత వైద్య మండలి ఆరోపణ. ఇంకెక్కడా ఖాళీ లేదన్నట్లు ఏనుగు మీద యోగా చేస్తూ కిందపడి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న రాందేవ్ బాబా, ప్రస్తుతం తమకున్న అతితక్కువ సౌలభ్యాలతో తమ ప్రాణాలకు హాని అని తెలుస్తున్నా కొత్త రోగంతో పోరాడుతున్న వైద్యులమీద, ఆ వైద్య విధానాలమీద చేసిన వ్యాఖ్యలు నిజంగానే హేయమైనవి. అదీకాక పతంజలి సంస్థనుండి వచ్చిన తాజా వివరణ ఇంకా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన కేవలం తనకొచ్చిన వాట్సాప్ సందేశం చదువుతున్నారని, ఆయనకి వైద్యులని అవమానించే ఉద్దేశ్యం లేదని తెలియచేసింది [2] . కానీ ఆయనమీద కేంద్ర ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటారని నేను అనుకోవడంలేదు.
Comments
Post a Comment