ప్రధాని మోడీ ఇచ్చిన "Repair and prepare" నినాదం ఏమిటి?
"Repair and prepare" అనే నినాదానికి అర్ధం నెమ్మదించిన/ దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థను తిరిగి బాగుచేసుకోవడమని. పడి లేచిన కెరటంలా అవ్వమని దానర్ధం.
సాధారణంగా ఏదైనా పెద్ద ప్రకృతి విపత్తు, యుద్దాలు జరిగినప్పుడు ఒక దేశపు ఆర్ధిక వ్యవస్థగానీ, ఏదైనా ఒక రంగంగానీ దెబ్బతింటే దాన్ని పునరుద్దరించాలనే సందర్భంలో ఈ నినాదం చేస్తుంటారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ దేశాలలో ఇటువంటి మార్పు కనిపించింది. కాకపోతే ఈ నినాదం ఏ నాయకుడూ ఇవ్వలేదు.
2018-20 మధ్యకాలంలో ఈ నినాదం కొంతమంది యురోపియన్ నాయకులు కొన్ని సందర్భాల్లో చేసారు. విపరీతమైన కాలుష్యం వల్ల దెబ్బతిన్న వాతావరణాన్ని బాగుచేసుకుని తర్వాతి తరానికి అందించాలనే దృక్పధంతో "Repair and prepare for the next generation" అనే నినాదాన్ని స్వీడన్ దేశపు గ్రీన్ పార్టీ చెప్పడం నేను చూసాను. 2020లోనే ఇది యురోపియన్ పార్లమెంట్లో ఒక ఎజెండాగా చేరింది. బ్రెక్సిట్ సమయంలో ఐరోపా దేశాల ద్రవ్యోల్బణం తగ్గించి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చెయ్యాలని "Repair and prepare" అనే నినాదం చేసారు.
2021లో మన దేశంలో కోవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా మౌలిక వసతులు (ఆసుపత్రులు), పారిశ్రామిక రంగంలో ఏర్పడిన ఇబ్బందులనుండి బయటపడి తిరిగి పుంజుకోవాలనే ఉద్దేశ్యంతో మోడీగారు ఆ నినాదం చేసారు. ఇది ఎన్నికల హామీ కాదు, పార్టీ ఎజెండా అంతకంటే కాదు. కోవిడ్ ఉధృతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పులను సవరించుకుని మళ్ళీ సన్నద్ధమవ్వాలనే ఆ నినాదం ప్రధానోద్దేశ్యం.
Comments
Post a Comment