అనగనగా చింతలపుంత అనే గెలాక్సీలోని చిన్న సౌర కుటుంబంలో మధ్యస్థ పరిమాణంలో ఉన్న మిభూ అనే గ్రహంలో పరిణామక్రమంలో తెలివిగా తయారవుతున్న కొన్ని ఒంటికన్ను జీవుల కధ.
ఒక ప్రణాళిక ప్రకారం కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా కొన్ని సంస్థలకోసం కోరాలో ప్రచారం చేస్తున్నారేమోనని అనిపిస్తుంది. పైగా అది ప్రచారం అనే విషయం తెలియనంత తెలివిగా ఆ పని చేస్తున్నారని నా అనుమానం. ఉదాహరణకి ఈ క్రింది సమాధానాన్ని పరిశీలిస్తే ఆ సమాధానం ఒక కోర్స్ యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ వ్రాయబడింది. ఆ సమాధానం వ్యక్తిగత విషయం అని అనుకోవచ్చు. Vivek Adupa · 1సంవత్సరం సద్గురు అందిస్తున్న ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ ఎంతవరకు సమర్థవంతమైనది? నమస్కారం, ఒక ప్రక్రియ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అన్న విషయం వివిధ అంశాల పైన ఆధార పడి ఉంటుంది. అది, దానిని ఆచరణలో పెట్టే వ్యక్తుల మీదా, సాధనపై వారికి ఉన్న నిబద్దత మీద ముఖ్యంగా ఆధార పడి ఉంటుంది, కాబట్టి, నా సొంత అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2017లో నా b.tech పూర్తి అయ్యింది. అప్పటి నుండి నా జీవితంల… (మరిన్ని) కానీ ఈ సమాధానాన్ని అప్వోట్ చేసిన వారిని చూస్తే ఒక విషయం అర్ధం అవుతుంది. ఆ తొమ్మిదిమంది కోరా అన్ని భాషల్లోనూ రాసిన సమాధానాలన్నింటిలో 95 శాతం పైగా కేవలం ఒకే ఒక్క అంశంమీద వ్రాయబడ్డాయి. అది కూడా పదులనుండి వందలసంఖ్యలో. వేరే సామజిక మాధ్యమాలలోని ...
వినడానికి విచిత్రంగా ఉన్నా మనదేశంలోని ఒక సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగికంటే ఎక్కువసార్లు ఇక్కడ భారతీయ భోజనం తింటున్నాము. కాకపోతే తాజా భారతీయ కూరగాయలతో వండుకునే వంటలు తక్కువ. ఎక్కువగా స్థానిక మార్కెట్లో దొరికే కూరగాయలతోనే మన కూరలు వండుకుంటాం. మేముంటున్న చిన్న పట్టణంలో రెండు మూడొందలు మించి భారతీయులు ఉండరు. పైగా దేశంలోని మిగతా పెద్ద నగరాలకు ఇది దూరంగా కూడా ఉంటుంది. కాబట్టి మన పచ్చిమిర్చి, ములక్కాయ, బెండకాయ, ఆనబకాయ లాంటి కూరగాయలు దొరకవు. అప్పుడప్పుడూ ఒక అరబ్ కొట్టోడు తీసుకొస్తాడుగాని ఒక ఐదు కేజీలు కూరగాయలు కొంటే ఆ నెల జీతం అక్కడ పెట్టేసి వెళ్ళమంటాడు. జన్మానికో శివరాత్రి అన్నట్లు వాడు తెచ్చేదే ఎప్పుడో ఒకసారికదాఅని కొనేస్తాం. పప్పులు, కారాలు, మసాలాలు కూడా అక్కడే దొరుకుతాయి. ఊళ్లోని భారతీయులందరికీ వాడొక్కడే దిక్కు కాబట్టి వాడేంత చెబితే అంత. బేరం ఆడొచ్చా అనే అనుమానం వస్తే ఇక్కడ మీరు మహేష్ బాబు పంచ్ డైలాగ్ వేస్కొవచ్చు. మన చేపలు, రొయ్యలు ప్యాక్ చేసి ఫ్రోజెన్ చేసిన ప్యాకెట్లలో అమ్ముతారు. పీతలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు వంటివాటిని మర్చిపోవచ్చు. స్థానిక మార్కెట్లలో వంకాయ, ఉల్లిపాయ, టమాటో, పాలకూర, పు...
Comments
Post a Comment